రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ మహోత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ అపురూప ఘట్టానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైంది. వధువు బృహతి ‘ఈనాడు’ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజల ద్వితీయ కుమార్తె. వరుడు వెంకట్ అక్షయ్.. దండమూడి అమర్ మోహన్‌దాస్, అనితల కుమారుడు. వివాహ మహోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్, చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా రాజకీయ, న్యాయ, సినీ, వైద్య, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాత్రి 12.18 గంటలకు సంప్రదాయబద్ధంగా జీలకర్ర-బెల్లం కార్యక్రమం నిర్వహించారు. కల్యాణఘట్టానికి ముందు.. వేద పండితుల మంత్రాశీర్వచనాలు, మంగళ వాయిద్యాల నడుమ వధూవరులకు పుష్పఛత్రాలు పట్టి.. వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. కల్యాణవేదికను ఆలయ సంప్రదాయ నిర్మాణశైలి ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సప్తవర్ణ రంజితంగా.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో, విభిన్న పుష్పాలంకరణలతో వివాహవేదిక ప్రాంగణమంతా నయన మనోహరంగా కనిపించింది. బంధు మిత్రుల సాక్షిగా వెంకట్ అక్షయ్, బృహతి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
రామోజీగ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మనవరాలు బృహతి, అక్షయ్‌ల వివాహ మహోత్సవానికి అతిరథ మహారథులైన ఎందరో ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, భాజపా ఓబీసీ విభాగం జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రఘురామకృష్ణరాజు, కేశినేని నాని, సీఎం రమేశ్, సుజనా చౌదరి, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్, కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు, తెదేపా నేత నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.రామ్మోహన్‌రావు వధూవరులను ఆశీర్వదించారు.
న్యాయ నిపుణుల దీవెనలు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ ఎం.గంగారావు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ బి.కృష్ణమోహన్, హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) డి.వెంకటరమణ, ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యురాలు జస్టిస్ రజని, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ జి.రాధారాణి, జస్టిస్ పి.మాధవీదేవి, జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్, జస్టిస్ జె.శ్రీదేవి, జస్టిస్ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్, జస్టిస్ జి.అనుపమా చక్రవర్తి, జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్ ఎ.సాంబశివరావు నాయుడు, జస్టిస్ డి.నాగార్జున, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వధూవరులను ఆశీర్వదించారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కుటుంబసమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయ ప్రముఖుల ఆశీస్సులు..:తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు, తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్‌కుమార్, కేఆర్ సురేశ్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలంగాణ వైద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.