తెలుగు సాహిత్యంపై అభిరుచి కలిగిన రచయతలను ప్రోత్సహించేందుకు నిర్వహించిన 'కథావిజయం 2019' కథల పోటీల ఫలితాలను 'రామోజీ ఫౌండేషన్' విడుదల చేసింది. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈఎఫ్.ఎం, ఉషాకిరణ్ మూవీస్ భాగస్వామ్యంతో రూ. 2.50 లక్షల బహుమతుల్ని అందించనుంది. పోటీకి మన దేశంతో పాటు 4 విదేశాలు, 12 తెలుగేతర రాష్ట్రాలతో సహా మొత్తం 1991 రచనలు వచ్చాయి. 130 కథలు బహుమతి పొందేందుకు ఎంపికయ్యాయి. సుప్రసిద్ధ రచయితలు, సాహిత్య విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, అట్టాడ అప్పల్నాయుడు, పెద్దింటి అశోక్‌కుమార్, ఎ.వి. రమణమూర్తి బృందం వీటిని పరిశీలించింది. అన్నికోణాల నుంచి విశ్లేషించి.. కథల్ని ఎంపిక చేశారు. రూ. 2 వేల పారితోషికం అందిస్తూ 78 సాధారణ కథల్ని ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈ కథల్ని ఈనాడు ఆదివారం, తెలుగు వెలుగు, చతుర, విపుల పత్రకల్లో ప్రచురిస్తారు.
రూ.10,000 బహుమతి కథలు
- ఆకుపచ్చని కన్నీరు - డా. జడా సుబ్బారావు
- ఈ సంస్థ యజమానులు - డా. మూలా రవికుమార్
- తపసు మాను - కె.ఎ. మునిసురేష్ పిళ్లై
- మూగరోదన - మండపాక శివప్రసాద్
- ఒకానొక దేవత ఇప్పడు లేదు - పసుపులేటి అనురాధ
- నమ్మదగిన మాట - గంగువ నరసింహారెడ్డి
- ఎలా దాచను? - ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి
- పెంపకం - షేక్ అహమద్ బాష
- విలోమ చిత్రాలు - ఎస్.జి.జిజ్ఞాస
- పరపతి - శరత్ చంద్ర