Ramoji Foundation:సామాజిక బాధ్యతలో భాగంగా రామోజీ ఫౌండేషన్.. మరో రెండు కార్యక్రమాలు చేపట్టింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్లో.. దాదాపు రూ.3 కోట్ల 85 లక్షలతో రెవెన్యూ కార్యాలయ భవనాల నిర్మాణానికి చేయూతనందిస్తోంది.
రెండుకోట్ల రూపాయలతో ఇబ్రహీంపట్నంలో ఆర్టీవో కార్యాలయ భవన నిర్మాణం చేపడుతోంది. రూ.కోటి 85 లక్షలతో అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తోంది. ఈ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ నిర్వహించారు.