అద్భుత శిల్పకళకు నిలయమైన రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడంతో ప్రముఖులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సీతక్క రామప్పలోని రుద్రేశ్వరుణ్ని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమైక్య పాలనలో రాష్ట్రంలోని ఏ కట్టడానికి గుర్తింపు రాలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే రామప్పకు ప్రపంచ ప్రఖ్యాతి దక్కిందని మంత్రి సత్యవతి అన్నారు.
గత ప్రభుత్వాలు విఫలం..
"కాకతీయుల అద్భుత శిల్పకళను వెలికితీయడంలో.. గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సీఎం కేసీఆర్ హయాంలో కాకతీయుల కీర్తి చాటేలా.. అనేక కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ కాకతీయ పథకం పేరుతో.. చెరువులను పునరుద్ధరించి రైతులకు సాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు."
- సత్యవతి రాఠోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి