ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ram Gopal Varma tweet: శృంగారంపై ఆర్జీవీ ట్వీట్.. ఏమన్నారంటే? - Ram Gopal Varma tweet

Ram Gopal Varma tweet on Sex Love : రామ్​గోపాల్​ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రేమను, సెక్స్​ను కెమిస్ట్రీ, ఫిజిక్స్​తో పోలుస్తూ ట్వీట్​ పెట్టాడు. దీనిపై కామెంట్లు, ట్రోల్స్ రూపంలో వర్మకి సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

RGV
RGV

By

Published : Dec 8, 2021, 3:11 PM IST

వివాదాలు వైఫైలా చుట్టూ తిప్పుకునే సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఉదయాన్నే లేచి పోర్న్ సినిమాలు చూస్తానని గతంలో చెప్పి షాకిచ్చిన వర్మ.. తాజాగా ప్రేమ, శృంగారానికి సంబంధించి బోల్డ్ కామెంట్‌ చేశారు.

ప్రేమని, సెక్స్​ను కెమిస్ట్రీ, ఫిజిక్స్​తో పోలుస్తూ ట్వీట్​ పెట్టాడు. "ప్రేమ అనేది కెమిస్ట్రీకి సంబంధించినదని, కానీ సెక్స్ ఫిజిక్స్ కి సంబంధించినది" అని బోల్డ్​ ట్వీట్‌ చేసి మరోసారి వివాదానికి తెరలేపాడు.

వర్మ పోస్ట్​పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెచ్చిపోతున్నారు. వర్మను మించిన కామెంట్లు చేస్తూ హీట్​ పెంచుతున్నారు. "లస్ట్ మ్యాథ్స్" అంటూ అందు​కు సంబంధించిన కొలతలు పెడుతున్నారు. మ్యారేజ్‌ కామర్స్​కు సంబంధించినదని, విడాకులు అనేది ఆర్ట్స్ అని, ప్రెగ్నెన్సీ బయోలజీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రామ్‌గోపాల్‌ వర్మ.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన "డేంజరస్‌", "12 o clock" అనే హార్రర్‌ సినిమా, "లడ్కీ", "కొండా" అనే సినిమాలనూ రూపొందిస్తున్నారు. "కొండా" మూవీ.. కొండా సురేఖ, కొండా మురళీ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details