Ram Gopal Varma comments on Bheemla Nayak: వివాదాలు వైఫైలా చుట్టూ తిప్పుకునే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. తాజాగా సోషల్ మీడియోలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. నేడు విడుదలై థియేటర్లను షేక్ చేస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాపై సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'భీమ్లానాయక్' సినిమాపై ఆర్జీవీ రివ్యూ..! - రామ్‌గోపాల్ వర్మ
RGV comments on Bheemla Nayak: ఇటీవల విడుదలైన 'భీమ్లానాయక్' ట్రైలర్‌పై వివాదాస్పద ట్వీట్లు చేసిన రామ్‌గోపాల్ వర్మ.. ఈరోజు విడుదలైన సినిమాపై మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేశాడు. భీమ్లానాయక్ సినిమాను భూకంపంతో పోలుస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు ఆర్జీవీ.

'భీమ్లానాయక్' పిడుగు లాంటిది. పవన్ సునామీ లాంటివాడు. పవన్ కల్యాణ్‌తో రానా పోటాపోటీగా నటించాడు. మొత్తానికి ఇదో భూకంపం' అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. నేను ఎప్పటినుంచో చెబుతున్నట్లుగా 'భీమ్లానాయక్' సినిమాను హిందీలోనూ రిలీజ్ చేస్తే కచ్చితంగా సంచలనం సృష్టిస్తుంది అంటూ మరో ట్వీట్ చేశాడు వర్మ. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. ఈసారి పాజిటివ్ కామెంట్స్ చేయడం నెటిజన్లను, పవన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇదీ చూడండి:Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్' ఎలా ఉందంటే?