RGV Tweets Again on Tickets Price in AP: ఏపీలో సినిమా టికెట్ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు నిర్మాత రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. రాష్ట్రంలోని సినిమా టికెట్ల ధరపై మరోసారి రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. సినిమా నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా టికెట్ ధరలు పెరిగేలా చూడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా: ఆర్జీవీ - ram gopal varma on tickets issue

16:58 January 14
RGV Again on Tickets: ఏపీలో సినిమా టికెట్ల ధరపై మరోసారి రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు
'టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అంగీకరించాలని దేవుడిని వేడుకుంటున్నా. ఫ్లాప్ సినిమాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని కోరుతున్నా. చిన్న సినిమాలు కూడా బాహుబలిని మించి హిట్ కావాలని ఆశిస్తున్నా' అంటూ ఆర్జీవీ ట్విట్ చేశారు.
నేను త్వరగా చనిపోవాలని.. నన్ను ద్వేషించేవాళ్లు కోరుకుంటారు. వారి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా అంటూ.. సంక్రాంత్రి సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
ఇదీ చదవండి..:పొలిటికల్ రీ ఎంట్రీపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు