రక్షాబంధన్...ప్రియమైన చెల్లెలికి బహుమతి ఏమిస్తే బాగుంటుంది అని ప్రతీ అన్నా ఆలోచిస్తాడు.అక్క కోసం ఏ గిఫ్ట్ కొనాలని తమ్ముడు తాపత్రయ పడతాడు.ఎప్పుడూ ఇచ్చే చాక్లెట్లు,డ్రెస్సులు లాంటివి కాకుండా కొంచెం భిన్నంగా సోదరికి ఉపయోగపడే బహుమతులు ఇస్తే ఎలా ఉంటుంది.అలాంటి అరుదైన బహుమతులు ఇవే...
1.సేఫ్టీ కిట్
సోదరి భద్రత కోసం సేఫ్టీ కిట్‌ను బహుమతిగా ఇస్తే అది ఉపయోగపడుతుంది.అంటే పెప్పర్ స్ర్రే,చిన్న టార్చు,ఆత్మ రక్షణ అలారంలాంటివి ఒక బాక్స్ లో పెట్టి గిఫ్ట్ గా ఇవ్వండి.దేశంలో జరుగుతున్న లైంగిక దాడుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఈ కిట్ ఉపయోగపడుతుంది.ఆన్ లైన్ లో ఈ కిట్199రూపాయల నుంచి599రూపాయలలో దొరుకుతుంది.
2.గిఫ్ట్ ఆఫ్ ఫిట్ నెస్
ఇది మీ సోదరికి మంచి బహుమతి.వ్యాయామం మనిషి జీవితంలో ముఖ్యమైంది.ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఫిన్ నెస్ ట్రైనింగ్ సెంటర్ లో పాస్ తీసుకొని బహుమతిగా ఇవ్వొచ్చు.ఇది వెయ్యి రూపాయలలోపే ఉంటుంది.
3.పర్సనల్ అసిస్టాంట్