ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ - రాజ్యసభ ఎన్నికల వార్తలు 2020

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 167 ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అరెస్టు కారణంగా తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, అనారోగ్య సమస్యలతో అనగాని సత్యప్రసాద్ ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. తెదేపా రెబల్ ఎమ్మెల్యే కరణం బలరాం అసెంబ్లీ ప్రాంగణానికి రాలేదు.

కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్
కొనసాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్

By

Published : Jun 19, 2020, 2:42 PM IST

రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇవ్పటి వరకు 167 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైకాపా తరపున సీఎం జగన్ తొలి ఓటువేయగా... తెదేపా తరపున ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి ఓటువేశారు. తమకు కేటాయించిన అభ్యర్ధులకు వైకాపా ఎమ్మెల్యేలు ఓటువేస్తున్నారు. తెదేప్ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురు అభ్యర్థులకు 38, నాలుగో అభ్యర్దికి 37 ఓట్లు వైకాపా కేటాయించింది. తెదేపా రెబెల్ ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి ఓటేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. మరో తెదేపా రెబల్ ఎమ్మెల్యే కరణం బలరాం అసెంబ్లీ ప్రాంగణానికి రాలేదు.

తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన కారణంగా ఓటేసేందుకు హాజరు కాలేకపోయారు. అచ్చెన్నాయుడుకు ఓటేసేందుకు అనుమతివ్వాలని ఈసీని కోరామని కానీ.. ఇంకా అనుమతి రాలేదని తెలుగుదేశం నేతలు తెలిపారు. అరెస్ట్ కారణంగా అచ్చెన్నాయుడు, అనారోగ్య కారణాలతో అనగాని సత్యప్రసాద్ ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైకాపా అభ్యర్ధికే ఓటువేశారు.

ఇదీ చదవండి: లైవ్ అప్​డేట్స్: ఏపీలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details