వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దిల్లీలో బుధవారం రాత్రి ఇచ్చిన విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు. వీరితో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, వైకాపా, తెరాస, తెదేపా లోక్‌సభ పక్ష నేతలు మిథున్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రామ్మోహన్ నాయుడు సహా పలు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, రఘురామకృష్ణరాజు వియ్యంకుడు కె.వి.పి.రామచంద్రరావు నివాసంలో విందు ఉంటుందని తొలుత ఎంపీలకు సమాచారమిచ్చారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుని నివాసంలో విందుకు కేంద్ర మంత్రులు వెళ్లడం బాగుండదనే ఉద్దేశంతో చివరలో నూతన ఎంపీల తాత్కాలిక నివాసంగా ఉన్న వెస్ట్రన్ కోర్టుకు మార్చారు.
వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్ - వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్ వార్తలు
వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు దిల్లీలో బుధవారం రాత్రి ఇచ్చిన విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు.
Rajnath Singh attend For Feast in YCP MP Raghu rama Krishnaraju
ఇదీ చదవండి : నేడు కాకినాడలో జనసేన అధినేత పవన్ దీక్ష