రజినీకాంత్‌కు అస్వస్థత.. హైదరాబాద్ అపోలోలో చికిత్స.. - రజినీకాంత్‌కు అస్వస్థత తాజా వార్తలు
![రజినీకాంత్‌కు అస్వస్థత.. హైదరాబాద్ అపోలోలో చికిత్స.. Rajinikanth admitted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9998828-92-9998828-1608885087064.jpg)
06:46 December 25
అధిక రక్తపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్సకు అందిస్తున్నారు. రజనీకాంత్‌కు బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నత్తై చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.
రజనీకి కొవిడ్ నెగటివ్ వచ్చిందని.... బీపీ సమస్యతోనే ఆస్పత్రిలో చేరినట్లు అపోలో వర్గాలు వెల్లడించాయి. బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గుల ఉన్నాయని... అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. రజనీకాంత్‌కు బీపీ తప్ప... మరే ఇతర ఇబ్బందులు ఏమీలేవని వైద్యులు స్పష్టంచేశారు. రక్తపోటు నియంత్రణలోకి వచ్చేవరకూ పర్యవేక్షణలో ఉంచుతామని.. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ను డిశ్చార్జి చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి:'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం'