కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు జరిగి.. వాటా కేటాయించే వరకు గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును(KRMB Meeting news) కోరామని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరైన రజత్‌కుమార్.. రాష్ట్ర అభ్యంతరాలు తెలిపామన్నారు. కృష్ణా పరిధిలో 65 కేంద్రాలు గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్నాయని వివరించారు. నాగార్జునసాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరిందని.. తాము అభ్యంతరం చెప్పామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా ఆడిగామన్నారు.
కొత్త నిర్ణయాలు తీసుకోలేదు..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB Meeting news) సమావేశంలో కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని రజత్‌కుమార్(Rajat Kumar Comments) తెలిపారు. విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని ఏపీ అడుగుతోందని వెల్లడించారు. ఈ నెల 14లోగా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. త్వరలో కేంద్రానికి, ఏపీకి తమ నిర్ణయాన్ని చెబుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు రుణాల గురించి ఏమీ చర్చించలేదని రజత్‌కుమార్ అన్నారు. శ్రీశైలంలో నిబంధనల ప్రకారమే విద్యుదుత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ(KRMB) ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన బోర్డు ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీకి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు.
యాభై శాతం వాటా అడుగుతున్నాం..