నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతం, మధ్య, తూర్పు ప్రాంతాల్లో విస్తరించినట్లు వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతం, బంగాల్, ఉత్తర ఒడిశాలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
WEATHER: నైరుతి రుతుపవనాల విస్తరణ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం - andhrapradhesh latest news
నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతం, మధ్య, తూర్పు ప్రాంతాల్లో విస్తరించినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాబోయే రెండు రోజుల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు
ఈరోజు ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొన్నారు.
ఇదీచదవండి.