ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Rains: అల్పపీడన ద్రోణి ప్రభావం.. వర్షాలు కురిసే అవకాశం - అల్పపీడన ద్రోణి తాజా వార్తలు

ఈ నెల 28న అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని.. దాని కారణంగా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.

rains
వర్షాలు కురిసే అవకాశం

By

Published : Jul 26, 2021, 4:20 PM IST

ఉత్తర బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఈ నెల 28న అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు స్టెల్లా వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు.

స్టెల్లా, వాతావరణ శాఖ సంచాలకురాలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details