రాష్ట్రంలో పశ్చిమ- నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రత్యేకించి ఉత్తర, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
rains: రాగల 24గంటల్లో రాష్ట్రంలో ఆ ప్రాంతాల్లో వర్షాలు - వాతావరణం
నైరుతి గాలుల ప్రభావంతో రాగల 24గంటల్లో రాష్ట్రంలో వర్షాలు(rains) కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుముల, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
వర్షాలు
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా చోట్ల వాతావరణం పొడిగా ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడినట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది.
ఇదీ చదవండి:రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..పొంగుతున్న వాగులు