ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాగల 24 గంటల్లో.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన - ఏపీలో వానలు

నైరుతీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో.. వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

రాగల 24 గంటల్లో ఆ ప్రాంతాల్లో వర్షాలు
రాగల 24 గంటల్లో ఆ ప్రాంతాల్లో వర్షాలు

By

Published : Jan 15, 2022, 3:37 PM IST

నైరుతీ బంగాళాఖాతంలో.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఉభయగోదావరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకూ వర్ష సూచన ఉందని అంచనా వేసింది. మరోవైపు.. ఉత్తర, పశ్చిమ భారత్‌ నుంచి వీస్తున్న శీతగాలులతో.. సాధారణం కంటే 3 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు.. వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదీ చదవండి: Sankranti Protest: సమర సంక్రాంతి నిరసన.. ఆకుపచ్చ బెలూన్లు ఎగరవేసిన రాజధాని రైతులు

ABOUT THE AUTHOR

...view details