ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Rains Live Updates: రాష్ట్రంలో వర్షాలు - వరద గుప్పిట్లోనే ఆ జిల్లాలు

rains in ap live updates
rains in ap live updates

By

Published : Nov 21, 2021, 8:08 AM IST

Updated : Nov 21, 2021, 10:00 PM IST

21:54 November 21

వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు

  • వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు, ఆలస్యం: ద.మ.రైల్వే
  • రేపటి విశాఖపట్నం-కడప (17488) రైలు రద్దు
  • రేపటి తిరుపతి-భువనేశ్వర్‌ (22872) రైలు రద్దు
  • రేపటి బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌ (17237) రైలు రద్దు
  • రేపటి చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట (17238) రైలు రద్దు
  • రేపటి చెన్నై సెంట్రల్‌-బిలాస్‌పూర్‌ (12852) రైలు రద్దు
  • రేపటి హౌరా-యశ్వంత్‌పూర్ (22863) రైలు రద్దు
  • రేపటి హౌరా-చెన్నై సెంట్రల్‌ (12841) రైలు రద్దు
  • రేపటి హౌరా-కన్యాకుమారి (12665) రైలు రద్దు
  • రేపటి ధన్‌బాద్‌-అలప్పుజ (13351) రైలు రద్దు
  • రేపటి ముజఫర్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ (15528) రైలు రద్దు

21:54 November 21

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి వస్తున్న లక్షా వెయ్యి క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 857.5 అడుగులు
శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 215.8 టీఎంసీలు
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నిల్వ 98.68 టీఎంసీలు

18:56 November 21

గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

  • కృష్ణా: గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం
  • వర్షానికి జలమయమైన గన్నవరం లోతట్టు ప్రాంతాలు
  • గౌడపేట, దావాజీగూడెం, ముస్తాబాద్‌లో ఇళ్లలోకి చేరిన నీరు
  • సూరంపల్లి, ఉంగుటూరు శివారు ప్రాంతాల్లోకి చేరిన నీరు
  • నీటమునిగిన రహదారులు, వాహనదారులకు అవస్థలు

17:24 November 21

గండిని ఇసుక బస్తాలతో పూడుస్తున్న యువకులు

  • రాయలచెరువు గండిని ఇసుక బస్తాలతో పూడుస్తున్న యువకులు
  • ఇసుక బస్తాలతో నీటిని అదుపు చేసేందుకు ప్రయత్నం
  • పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించిన జిల్లా ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న
  • అదనంగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు బృందాలను పంపాలన్న ప్రద్యుమ్న

16:45 November 21

మరో రెండు రైళ్లు రద్దు

  • దక్షిణమధ్య రైల్వే పరిధిలో మరో రెండు రైళ్లు రద్దు
  • 12798 చిత్తూరు - కాచిగూడ రైలు రద్దు
  • 17487 కడప - విశాఖపట్నం రైలు రద్దు

16:45 November 21

గ్రామాలను ఖాళీ చేయించాం: కలెక్టర్‌

  • రాయలచెరువు గండిని పరిశీలించిన చిత్తూరు కలెక్టర్, ఎస్పీ
  • గండి ప్రమాదకరంగా లేదని నీటిపారుదల అధికారులు చెప్పారు: కలెక్టర్‌
  • రాయలచెరువు లోతట్టు గ్రామాలను ఖాళీ చేయించాం: కలెక్టర్‌
  • గండిని ఇసుక బస్తాలతో పూడ్చేందుకు యత్నం: ఎస్పీ అప్పలనాయుడు
  • ఇప్పటివరకు 25 గ్రామాలు ఖాళీ చేయించాం: ఎస్పీ అప్పలనాయుడు
  • ప్రజలకు అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం: ఎస్పీ
  • రామచంద్రాపురంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశాం: ఎస్పీ
  • రాయలచెరువు వద్దకు స్థానికులు ఎవరూ రావొద్దు: ఎస్పీ అప్పలనాయుడు

16:45 November 21

వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ఎల్లుండి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటన
ఈ నెల 24న నెల్లూరులో చంద్రబాబు పర్యటన
వరద బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు

16:44 November 21

వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి: సీఎం

  • వరద ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానక్కర్లేదు: సీఎం జగన్‌
  • వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి: సీఎం
  • ఇన్‌ఛార్జ్‌ మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలి: సీఎం
  • గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సాయం అందేలా చూడాలి: సీఎం
  • పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులు చేపట్టాలి: సీఎం జగన్‌
  • రేషన్‌ సరకుల పంపిణీ, నష్టంపై పక్కాగా అంచనా వేయాలి: సీఎం జగన్‌
  • పంట దెబ్బతిన్న రైతులు తిరిగి సాగు చేసేలా చర్యలు తీసుకోవాలి: సీఎం
  • అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలి: సీఎం

16:44 November 21

పలు రైళ్లు రద్దు, మళ్లింపు

  • నెల్లూరు-పడుగుపాడు మార్గంలో పలు రైళ్లు రద్దు, మళ్లింపు
    18 రైళ్లు రద్దు, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేత
    10 రైళ్లు దారి మళ్లింపు, ఒక రైలు వేళలో మార్పు
    20895 రామేశ్వరం - భువనేశ్వర్‌ రైలు రద్దు
    22859 పూరి - చెన్నె సెంట్రల్‌ రైలు రద్దు
    17489 పూరి - తిరుపతి రైలు రద్దు
    12655 అహ్మదాబాద్‌ - చెన్నై సెంట్రల్‌ రైలు రద్దు
  • 12967 చెన్నై సెంట్రల్‌ - జైపూర్‌ రైలు రద్దు
    06426 నాగర్‌సోల్‌ - తిరువనంతపురం రైలు రద్దు
    06427 తిరువనంతపురం - నాగర్‌సోల్‌ రైలు రద్దు
    06425 కొల్లాం - తిరువనంతపురం రైలు రద్దు
    06435 తిరువనంతపురం - నాగర్‌సోల్‌ రైలు రద్దు
    12863 హౌరా - యశ్వంతపూర్‌ రైలు రద్దు
    12269 చెన్నై సెంట్రల్‌ - హజరత్‌ నిజాముద్దీన్‌ రైలు రద్దు
    12842 చెన్నై సెంట్రల్‌ - హౌరా రైలు రద్దు
    12656 చెన్నై సెంట్రల్‌ - అహ్మదాబాద్‌ రైలు రద్దు
    12712 చెన్నై సెంట్రల్‌ - విజయవాడ రైలు రద్దు
    12510 గువాహటి - బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు రద్దు
    15930 న్యూ తినుసుకియా - తాంబరం రైలు రద్దు
    17651 చెంగల్‌పట్టు - కాచిగూడ రైలు రద్దు
    20890 తిరుపతి - హౌరా రైలు రద్దు
  • రైళ్లు మళ్లింపు
    12642 హజరత్‌ నిజాముద్దీన్‌ - కన్యాకుమారి రైలు మళ్లింపు
    12616 న్యూదిల్లీ - చెన్నై సెంట్రల్‌ రైలు మళ్లింపు
    22877 హౌరా - ఎర్నాకులం రైలు మళ్లింపు
    12845 భువనేశ్వర్‌ - బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు మళ్లింపు
    22502 న్యూ తినుసుకియా - బెంగళూరు రైలు మళ్లింపు
    12270 హజరత్‌ నిజాముద్దీన్‌ - చెన్నై సెంట్రల్‌ రైలు మళ్లింపు
    12655 అహ్మదాబాద్‌ - చెన్నై సెంట్రల్‌ రైలు మళ్లింపు
    12622 న్యూదిల్లీ - చెన్నై సెంట్రల్‌ రైలు మళ్లింపు
    12296 దానపూర్‌ - బెంగళూరు రైలు మళ్లింపు
    12968 జైపూర్‌ - చెన్నై సెంట్రల్‌ రైలు మళ్లింపు
    13351 ధన్‌బాద్‌ - అలప్పుజా రైలు 3 గంటలు ఆలస్యం

13:59 November 21

భారీ వరదల కారణంగా దెబ్బతిన రోడ్డు.. స్తంభించిన ట్రాఫిక్

రాష్ట్రంలో భారీ వరదలు
  • తిరుపతి: శ్రీనివాస మంగాపురం రైల్వే బ్రిడ్జ్ వద్ద దెబ్బతిన్న రోడ్డు
  • రహదారి దెబ్బతినడంతో స్తంభించిన వాహన రాకపోకలు

13:59 November 21

కడప: మాండవ్య నదిలో గల్లంతైన అక్క, తమ్ముడు మృతి

  • నదిలో గల్లంతైన అక్క, తమ్ముడి మృతదేహాలు గుర్తింపు
  • కడప: చిన్నమండెం మం. వండాడి వద్ద నదిలో గల్లంతు
  • నది దాటుతుండగా వరద నీటిలో గల్లంతైన అక్క, తమ్ముడు
  • కడప: గల్లంతైన వారు చాకిబండ వాసులుగా గుర్తింపు

13:59 November 21

కర్నూలు: నిండుకుండలా గాజులదిన్నె జలాశయం

  • గాజులదిన్నె జలాశయం నాలుగో గేటు ఎత్తివేత
  • గాజులదిన్నె జలాశయం ఇన్‌ఫ్లో 6 వేల క్యూసెక్కులు
  • గాజులదిన్నె జలాశయం ఔట్‌ఫ్లో 1500 క్యూసెక్కులు

13:46 November 21

తిరుపతి: రామచంద్రాపురంలో రాయల చెరువుకు గండి పడే ప్రమాదం

  • చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో లీకవుతున్న వరద నీరు
  • చెరువు కట్ట నుంచి జారుతున్న మట్టి, భయాందోళనలో స్థానికులు
  • ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న ప్రజలు
  • రాయల చెరువు తెగితే వంద పల్లెలకు ముంపు ప్రమాదం
  • చెరువు దిగువ పల్లెలను అప్రమత్తం చేసిన అధికారులు
  • రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేత
  • సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరులో అప్రమత్తత
  • గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లిలో అప్రమత్తత
  • గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరులో అప్రమత్తత
  • వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో అప్రమత్తత
  • పల్లెలు ఖాళీ చేయాలని హెచ్చరించిన అధికారులు
  • పరిస్థితి పర్యవేక్షిస్తున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు

13:34 November 21

ద్విచక్రవాహనంతో సహా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన స్థానికులు

  • కడప: లింగాల వద్ద వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన ప్రజలు
  • ద్విచక్రవాహనంపై వస్తుండగా వాగులో కొట్టుకుపోయిన ప్రతాప్‌రెడ్డి

13:34 November 21

ప.గో.: దెందులూరు జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేత

  • దెందులూరు జాతీయ రహదారిపై బారులు తీరిన వాహనాలు
  • నెల్లూరు జిల్లాలో జాతీయరహదారి దెబ్బతినడంతో వాహనాలు నిలిపివేత

13:25 November 21

తిరుపతి: రామచంద్రాపురంలో రాయల చెరువుకు గండి పడే ప్రమాదం

  • తిరుపతి: రాయల చెరువు కట్ట నుంచి లీకవుతున్న వరద నీరు
  • రాయల చెరువు పరిస్థితిపై పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ
  • రాయల చెరువు తెగితే వంద గ్రామాలకు ముంపు ప్రమాదం
  • చెరువు దిగువ గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
  • రాయల చెరువు నీటి సామర్థ్యం తగ్గించేందుకు అధికారుల యత్నం
  • రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేత

12:35 November 21

బైక్​తో సహా వాగులో కొట్టుకుపోయిన యువకుడు.. కాపాడిన స్థానికులు

ప్రకాశం: బైక్‌పై వెళ్తూ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు

కారంచేడు మం. దగ్గుబాడు వద్ద చప్టాపై వాగు ఉద్ధృత ప్రవాహం 

వాగు ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడిని కాపాడిన స్థానికులు

12:22 November 21

ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే భారీ వాహనాల మళ్లింపు

  • జాతీయరహదారిపై భారీ వాహనాలను మళ్లిస్తున్న పోలీసులు
  • ప్రకాశం: మార్టూరు మం. డేగలమూడి ట్రక్ పార్కింగ్‌లో నిలిపివేత
  • భారీ వర్షాలకు పర్చూరు నియోజకవర్గంలో పొంగుతున్న వాగులు
  • మార్టూరు-డేగరమూడి మధ్య జాతీయరహదారిపై ఉద్ధృత ప్రవాహం
  • యద్దనపూడి మం. పోలూరు వద్ద పొంగుతున్న పర్చూరు వాగు
  • పర్చూరు-ఇంకొల్లు మధ్య పూసపాడు వద్ద పొంగుతున్న కప్పల వాగు
  • భూపతిపల్లి-కంభం మార్గంలో గుండ్లకమ్మ వాగు ఉద్ధృత ప్రవాహం
  • గుండ్లకమ్మ వాగు ఉద్ధృత ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలు మళ్లించిన అధికారులు
  • సంతమాగులూరు మం. వెల్లాల చెరువు నుంచి వరద ప్రవాహం
  • వెల్లాల చెరువు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్‌లోకి భారీగా వరద నీరు
  • ప్రకాశం: వెల్లాల చెరువు గ్రామానికి నిలిచిన రాకపోకలు
  • ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్థుల వినతి
  • ప్రకాశం: అధికారులు స్పందించట్లేదని గ్రామస్థుల ఆగ్రహం
  • ప్రకాశం: ప్యాసింజర్ ఆపి వెల్లాలచెరువు గ్రామస్థుల నిరసన

10:49 November 21

వరదలకు పాపాఘ్ని వంతెన 10 బ్లాకులు కూలాయి: ఈఈ ఓబుల్‌రెడ్డి

  • వంతెన కూలడంతో వాహన రాకపోకలు నిలిపివేశారు: ఈఈ
  • ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాం: ఈఈ ఓబుల్‌రెడ్డి
  • రెండ్రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ వంతెనను పరిశీలిస్తుంది: ఈఈ

10:30 November 21

నెల్లూరు: కోవూరు వద్ద కోతకు గురైన జాతీయరహదారి

  • భగత్‌సింగ్ కాలనీ వద్ద జాతీయరహదారికి మరమ్మతులు
  • మరమ్మతు చేపట్టిన జాతీయరహదారుల సంస్థ అధికారులు
  • జాతీయరహదారిపై తాత్కాలిక మరమ్మతులు పూర్తి: పీడీ గోవర్ధన్‌
  • ఒక మార్గంలో వాహన రాకపోకలకు అనుమతి: పీడీ గోవర్ధన్‌
  • రహదారికి రెండో వైపు కల్వర్టు తెగిపోయింది: పీడీ గోవర్ధన్‌
  • కల్వర్టు నిర్మించాక రెండో వైపు వాహనాలకు అనుమతి: పీడీ గోవర్ధన్‌

10:24 November 21

నెల్లూరు-ముంబయి జాతీయరహదారిపై తగ్గిన వరద ప్రవాహం

  • కోలగట్ల, బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు వద్ద రాకపోకలకు అనుమతి
  • రెండ్రోజులుగా జాతీయరహదారిపై వరదతో రాకపోకలు నిలిపివేత

10:22 November 21

కడప రైల్వేస్టేషన్‌లో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

  • భారీ వర్షాలు, వరదల దృష్ట్యా రైలును నిలిపివేసిన అధికారులు
  • తిరుమల వెళ్తున్న దాదాపు 2 వేల మంది ప్రయాణికులు
  • విశాఖ, విజయవాడ తదితర చోట్ల నుంచి తిరుమల వెళ్తున్న ప్రయాణికులు
  • తిరుమల వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆందోళన
  • కడప: రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు

09:59 November 21

వరదల దృష్ట్యా తెదేపా శ్రేణులకు చంద్రబాబు పిలుపు

  • వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశం
  • సహాయ చర్యలకు సమన్వయకర్తలుగా సీనియర్ నేతలకు బాధ్యతలు
  • సమన్వయకర్తలుగా నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు
  • సమన్వయకర్తలుగా అనగాని సత్యప్రసాద్, పరసారత్నం

09:51 November 21

కడప రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన

  • తిరుపతి వెళ్లాల్సిన భక్తులను కడపలో దింపిన అధికారులు
  • ముందస్తు సమాచారం లేకుండా దింపడంపై భక్తుల ఆగ్రహం
  • అర్ధంతరంగా మధ్యలో దింపడంపై ప్రయాణికుల ఆగ్రహం
  • కడప: రైల్వే అధికారులతో ప్రయాణికుల వాగ్వాదం
  • బస్సుల ద్వారా పంపేందుకు ఏర్పాటు చేస్తామన్న అధికారులు
  • కడప: వరదల కారణంగా రైలును నిలిపివేసిన అధికారులు

09:40 November 21

నెల్లూరు-విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం

  • కడప-తిరుపతి మార్గంలో రాకపోకలు నిలిపివేసిన ఆర్టీసీ
  • చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నిలిపివేత
  • నెల్లూరు బస్టాండ్‌లో ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు

09:39 November 21

పెన్నా నది వద్ద 16వ నంబరు జాతీయ రహదారికి గండి

  • నెల్లూరు శివారులో పెన్నా నదిపై బలహీనపడిన వంతెన
  • నెల్లూరు: వంతెన బలహీనపడటంతో రాకపోకలు నిలిపివేత
  • అర్ధరాత్రి 12 నుంచి జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేత
  • నెల్లూరు: కోవూరు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి
  • పెన్నా నది ఉద్ధృతికి భారీగా దెబ్బతిన్న జాతీయ రహదారి
  • చెన్నై-కోల్‌కతా 16వ నంబర్‌ జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేత
  • కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని పోలీసుల సూచన
  • మరమ్మతులకు కనీసం 48 గంటలు పడుతుందన్న అధికారులు
  • నెల్లూరు బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు
  • నెల్లూరు సమీపంలో దెబ్బతిన్న రహదారులు
  • రోడ్లు దెబ్బతినడంతో 5 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
  • నెల్లూరు వద్ద రహదారిని పరిశీలిస్తున్న పోలీసులు, అధికారులు
  • తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వచ్చే వాహనాలు నిలిపివేత
  • తొట్టంబేడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు నిలిపివేస్తున్న పోలీసులు
  • తొట్టంబేడు వద్ద జాతీయరహదారిపై బారులు తీరిన వాహనాలు
  • సంగం-ఆత్మకూరు జాతీయరహదారిపై రాకపోకలు పునరుద్ధరణ
    నెల్లూరు నుంచి కడపకు వెళ్లే వాహనాలకు అనుమతి
  • ద్విచక్రవాహనాలు మినహా అన్ని వాహనాలకు అనుమతి
  • నెల్లూరు: సంగం మం. కోలగట్ల వద్ద తగ్గిన వరద ఉద్ధృతి

09:17 November 21

రాష్ట్రంలో వరదలపై ట్విట్టర్‌లో స్పందించిన రాహుల్‌ గాంధీ

  • రాష్ట్రంలో వరదలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి: రాహుల్‌ గాంధీ
  • ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి తెలిపిన రాహుల్‌
  • బాధితులకు అండగా ఉండాలని కార్యకర్తలకు రాహుల్‌ గాంధీ పిలుపు

08:57 November 21

నెల్లూరు: పెన్నా వరద ఉద్ధృతికి కోతకు గురైన రహదారి

  • కోవూరు బైపాస్‌ వద్ద కోతకు గురైన జాతీయ రహదారి
  • చెన్నై- కోల్‌కతా మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేత
  • నెల్లూరు వద్ద రహదారిని పరిశీలిస్తున్న పోలీసులు, అధికారులు

08:44 November 21

సంగం- ఆత్మకూరు జాతీయ రహదారిపై రాకపోకలు పునరుద్ధరణ

  • నెల్లూరు: రోడ్లు దెబ్బతినడంతో 5 కి.మీ. మేర నిలిచిన వాహనాలు
  • తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు వచ్చే వాహనాల నిలిపివేత
  • తొట్టంబేడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు నిలిపివేస్తున్న పోలీసులు
  • తొట్టంబేడు వద్ద భారీగా బారులు తీరిన వాహనాలు
  • నెల్లూరు: సంగం మం కోలగట్ల వద్ద తగ్గిన వరద ఉద్ధృతి
  • నెల్లూరు నుంచి కడపకు వాహనాలకు అనుమతి
  • ద్విచక్రవాహనాలు మినహా అన్ని వాహనాలకు అనుమతి

08:19 November 21

అనంతపురం జిల్లాలో వరదల నుంచి కోలుకుంటున్న గ్రామాలు

  • పుట్టపర్తిలో తగ్గిన వరద, బురదమయంగా మారిన ఇళ్లు
  • పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో మునిగిన పంట
  • అనంతపురం: పలుచోట్ల పూర్తిగా దెబ్బతిన్న ఉద్యాన పంటలు

08:10 November 21

నెల్లూరు: సోమశిల జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

  • సోమశిల జలాశయం ఇన్‌ఫ్లో 1,83,433 క్యూసెక్కులు
  • సోమశిల జలాశయం ఔట్ ఫ్లో 2,01,766 క్యూసెక్కులు
  • సోమశిల జలాశయం 12 గేట్లు ఎత్తి పెన్నా నదికి నీరు విడుదల
  • సోమశిల జలాశయం ప్రస్తుత నీటిమట్టం 69.07 టీఎంసీలు
  • సోమశిల జలాశయం పూర్తి నీటిమట్టం 77.98 టీఎంసీలు

08:09 November 21

ప్రకాశం: మార్టూరు, యద్దనపూడి ప్రాంతాల్లో వాన జల్లులు

  • ప్రకాశం: చీరాల, ముండ్లమూరు మండలాల్లో వర్షం
  • ప్రకాశం: చినగంజాంలో ఎడతెరిపిలేకుండా వర్షం

08:09 November 21

రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

  • విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలాచోట్ల జల్లులు
  • ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలాచోట్ల జల్లులు
  • వర్షాలతో పాటు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు

08:07 November 21

కడప: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన

  • వంతెన కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం
  • వంతెనకు కిలోమీటర్‌ దూరంలో వాహనాలు నిలిపివేత
  • కడప నుంచి తాడిపత్రికి వెళ్లే వాహనాలు మళ్లింపు
  • ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీదుగా వాహనాల మళ్లింపు
  • కడప జిల్లాలో వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు
  • రాజంపేట, నందలూరు, పెనగలూరు మండలాల్లో సహాయ చర్యలు
  • వరద ప్రభావిత గ్రామాల్లో జేసీబీలతో రోడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బంది
  • గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేస్తున్న అధికారులు
  • కడప: మైలవరం జలాశయానికి కొనసాగుతున్న వరద
  • మైలవరం జలాశయం నుంచి 70 వేల క్యూసెక్కులు విడుదల
  • కడప: లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

08:07 November 21

కడప: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన

  • కడప: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన
  • వంతెన కూలడంతో వాహన రాకపోకలకు అంతరాయం
  • వంతెనకు కిలోమీటర్‌ దూరంలో వాహనాలు నిలిపివేత

08:07 November 21

ప్రకాశం: టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద నిలిచిన భారీ వాహనాలు

  • జాతీయ రహదారి దెబ్బతినడంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు
  • నెల్లూరు జిల్లా కోవూరు వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారి
  • జాతీయరహదారిపై ఇబ్బంది పడుతున్న వాహనదారులు

08:06 November 21

తిరుపతి - ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రద్దు

  • నెల్లూరు-పడుగుపాడు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం
  • ప్రకాశం జిల్లా చీరాలలో నిలిచిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌
  • ప్రకాశం: వేటపాలెంలో నిలిచిన పూరీ ఎక్స్‌ప్రెస్‌
  • రైళ్లలో ప్రయాణికుల అవస్థలు

08:06 November 21

నెల్లూరు-విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయం

  • కడప-తిరుపతి మార్గంలో రాకపోకలు నిలిపివేసిన ఆర్టీసీ
  • చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నిలిపివేత
  • నెల్లూరు బస్టాండ్‌లో ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు
  • పెన్నా నది వద్ద 16వ నంబరు జాతీయ రహదారికి గండి
  • నెల్లూరు శివారులో పెన్నా నదిపై బలహీనపడిన వంతెన
  • నెల్లూరు: వంతెన బలహీనపడటంతో రాకపోకలు నిలిపివేత
  • అర్ధరాత్రి 12 నుంచి జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేత
  • నెల్లూరు: కోవూరు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి
  • పెన్నా నది ఉద్ధృతికి భారీగా దెబ్బతిన్న జాతీయ రహదారి
  • చెన్నై-కోల్‌కతా 16వ నంబర్‌ జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేత
  • కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని పోలీసుల సూచన
  • మరమ్మతులకు కనీసం 48 గంటలు పడుతుందన్న అధికారులు
  • నెల్లూరు బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

08:05 November 21

తిరుమల కనుమ రహదారులు పునరుద్ధరణ

  • భక్తులను తిరుమలకు అనుమతిస్తున్న తితిదే
  • తిరుమల: రెండు ఘాట్‌ రోడ్ల ద్వారా భక్తులకు అనుమతి
  • తిరుమల: ద్విచక్రవాహనాలకు అనుమతి నిరాకరణ
  • టికెట్లు ఉన్న భక్తుల దర్శనానికి అనుమతిస్తున్న తితిదే
  • తిరుమల: కాలినడక రహదారులు మూసివేత
  • శ్రీవారిమెట్టు, అలిపిరి రహదారులు మూసివేత
  • భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారిమెట్టు కాలినడక మార్గం
  • శ్రీవారిమెట్టు మార్గం పునరుద్ధరణ చేపట్టిన తితిదే

08:05 November 21

తిరుపతి నగరంలోకి వస్తున్న వరద నీరు

  • పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువు నుంచి వరద నీరు
  • తిరుపతిలోని పలు కాలనీల్లో తొలగని వరద నీరు
  • గాయత్రినగర్‌, సరస్వతి నగర్‌, శ్రీకృష్ణనగర్‌ జలదిగ్బంధం
  • ముత్యాలరెడ్డిపల్లి, ఉల్లిపట్టెడ, దుర్గానగర్‌ జలదిగ్బంధం
  • తిరుపతి: జలదిగ్బంధంలో మహిళా విశ్వవిద్యాలయం
  • తూర్పు పోలీస్‌స్టేషన్‌ అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద తగ్గిన వరద నీరు
  • తిరుపతి: వెస్ట్‌ చర్చి అండర్‌ బ్రిడ్జ్‌ వద్ద తగ్గిన వరద నీరు
  • నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమైన ఆటోనగర్‌ వాసులు
  • తిరుపతి: ఆటోనగర్‌లో ఇళ్లకే పరిమితమైన వెయ్యి కుటుంబాలు
  • తిరుపతి: పునరావాస కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు
  • రాకపోకలు పునరుద్ధరించిన నగరపాలక సంస్థ అధికారులు
  • రేణిగుంట నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరణ

08:04 November 21

నెల్లూరు శివారులో పెన్నా నదిపై బలహీనపడిన వంతెన

  • నెల్లూరు: వంతెన బలహీనపడటంతో రాకపోకలు నిలిపివేత
  • అర్ధరాత్రి 12 నుంచి జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేత
  • చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలు నిలిపివేత
  • నెల్లూరు బస్టాండ్‌లో ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు
  • నెల్లూరు బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు
  • కడప-తిరుపతి మార్గంలో రాకపోకలు నిలిపివేసిన ఆర్టీసీ

08:04 November 21

కడప: రాధాకృష్ణానగర్‌లో కూలిన మూడంతస్తుల భవనం

  • కడప: రాధాకృష్ణానగర్‌లో కూలిన మూడంతస్తుల భవనం
  • శిథిలాల్లో చిక్కుకున్న తల్లీకుమార్తెను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

07:50 November 21

LIVE UPDATES: వరద గుప్పిట్లో ఆ జిల్లాలు..

  • నెల్లూరు: నీటమునిగిన నవాబ్‌పేట, భగత్ సింగ్ కాలనీ
  • ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన పోలీసులు
Last Updated : Nov 21, 2021, 10:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details