రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో కొన్ని చోట్ల మంగళ, బుధవారాల్లో ఒక మోస్తరు వర్షం పడవచ్చన్నారు. దక్షిణ కోస్తాంధ్రలోను దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.
నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు - ఏపీ తాజా వార్తలు
రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
![నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఏపీలో వర్షాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11715074-411-11715074-1620699056649.jpg)
ఏపీలో వర్ష సూచన