ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GULAB EFFECT: కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఐఎండీ

Rains across the state affected by Gulab storm
గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

By

Published : Sep 27, 2021, 6:39 AM IST

Updated : Sep 27, 2021, 9:05 PM IST

20:59 September 27

  • తుపాను ప్రభావిత జిల్లాల జేసీలు, అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష
  • ముంపు ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించాలి: కన్నబాబు
  • ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తుపాను ప్రభావం: కన్నబాబు
  • తుపాను బాధిత రైతులకు అండగా నిలబడాలని సీఎం ఆదేశం: కన్నబాబు
  • 1.63 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి: కన్నబాబు
  • ముంపునీరు తగ్గితే వాస్తవ నష్టం అంచనాకు అవకాశం: మంత్రి కన్నబాబు
  • జలవనరులశాఖ ఎస్‌ఈలతో చర్చించి కాలువల్లో వర్షపు నీరు పోయేటట్టు చూడాలని జేసీలకు ఆదేశం
  • ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. 
  • ఆర్‌బీకే స్థాయి వరకు వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతులకు 24 గంటలూ అందు బాటులో ఉండాలి .
  • ముంపునీరు తగ్గగానే ఎన్యుమరేషన్‌ బృందాలు అంచనాలు రూపొందిస్తాయి -మంత్రి కన్నబాబు.


 


 

19:25 September 27

  • విశాఖ జిల్లాలో తగ్గిన వర్షం, ఈదురుగాలులు
  • విశాఖ: నీటమునిగిన కాలనీల్లో తగ్గిన వర్షపునీటి ఉద్ధృతి
  • విశాఖ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ
  • విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్‌ పునరుద్ధరణ
  • పదేళ్ల తర్వాత మేఘాద్రిగడ్డ రిజర్వాయర్‌కు గరిష్ఠ ప్రవాహం
  • మేఘాద్రిగడ్డ నుంచి 4 గేట్లు ఎత్తి నీరు వదిలిన అధికారులు

19:07 September 27

  • విశాఖ: గాజువాక సుందరయ్య కాలనీ వద్ద వాగులోపడి బాలుడు గల్లంతు
  • వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైన 14 ఏళ్ల బాలుడు

16:27 September 27

చిట్టినగర్ సొరంగం పక్కన విరిగిన కొండచరియలు
  • విజయవాడ: చిట్టినగర్ సొరంగం పక్కన విరిగిన కొండచరియలు
  • కొండచరియలు విరిగిపడి పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు
  • స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న కొత్తపేట పోలీసులు

16:12 September 27

  • విశాఖ: పాడేరు-ఒడిశా ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం
  • విశాఖ: గుత్తులపుట్టు వద్ద సగం వరకు కోతకు గురైన కల్వర్టు
  • కల్వర్టు కోతకు గురై నిలిచిన ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు

15:32 September 27

  • తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ తుపాను
  • ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, విదర్భ, తెలంగాణ సరిహద్దుల్లో కేంద్రీకృతం: ఐఎండీ
  • రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం: ఐఎండీ
  • తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఐఎండీ
  • మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఐఎండీ
  • ఉత్తరకోస్తా, ఒడిశా తీరంలో సముద్రం ఇంకా అలజడిగానే ఉంది: ఐంఎండీ
  • విశాఖ, గజపతినగరం, నెల్లిమర్లలో అత్యధికంగా 28 సెం.మీ. వర్షపాతం
  • మెంటాడలో 25, పూసపూటిరేగలో 24 సెం.మీ. వర్షపాతం: ఐఎండీ

13:28 September 27

నీటిమట్టం పెరగడంతో 4 గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కులు విడుదల

  • విశాఖ: పెందుర్తి మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో పెరిగిన కనీస నీటిమట్టం
  • విశాఖ: నీటిమట్టం పెరగడంతో 4 గేట్లు ఎత్తి 16 వేల క్యూసెక్కులు విడుదల

12:34 September 27

మెంటాడలో 24 సెం.మీ., పూసపాటిరేగలో 23 సెం.మీ. వర్షపాతం

  • విజయనగరం జిల్లాలో 18.6 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు
  • విజయనగరం జిల్లా గుర్లలో అత్యధికంగా 29 సెం.మీ. వర్షపాతం
  • గజపతినగరంలో 28 సెం.మీ., నెల్లిమర్లలో 27 సెం.మీ. వర్షపాతం
  • మెంటాడలో 24 సెం.మీ., పూసపాటిరేగలో 23 సెం.మీ. వర్షపాతం
  • విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 22 సెం.మీ. వర్షపాతం నమోదు

12:28 September 27

విజయనగరం జిల్లా రంగోడిగుడి చెరువుకు గండి

రంగోడిగుడి చెరువుకు గండి
  • విజయనగరం: గుర్ల మండలంలో రంగోడిగుడి చెరువుకు గండి

12:12 September 27

తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష

  • తుపాను అనంతర పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష
  • తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
  • ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియోకాన్ఫరెన్స్‌
  • ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌
  • తుపాను అనంతర పరిస్థితులను వివరించిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌
  • వర్షం తగ్గుముఖం పట్టగానే విద్యుత్‌ పునరుద్ధరించాలని సీఎం ఆదేశం
  • ఇవాళా అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎస్‌కు ఆదేశం
  • మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఇవ్వాలని ఆదేశం
  • బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: సీఎం
  • బాధితులకు సహాయం చేయడంలో వెనకడుగు వేయవద్దు: సీఎం
  • సహాయక శిబిరాల్లో అందించే ఆహారం నాణ్యంగా ఉండాలి: సీఎం
  • మెరుగైన వైద్యం, రక్షిత తాగునీరు అందించాలి: సీఎం జగన్‌
  • అవసరమైన అన్నిచోట్లా సహాయక శిబిరాలు తెరవాలి: సీఎం
  • విశాఖలోని ముంపు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగించాలి: సీఎం
  • ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి: సీఎం
  • ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి: సీఎం
  • శిబిరాల నుంచి బాధితులు వెళ్లేటప్పుడు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలి: సీఎం
  • వరద ప్రాంతాల్లో త్వరగా పంట నష్టం అంచనాలు రూపొందించాలి: సీఎం
  • నష్టం అంచనాలు సిద్ధంచేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి: సీఎం

12:08 September 27

బాధితులకు తెదేపా నాయకులు, కార్యకర్తలు సాయం అందించాలి: చంద్రబాబు

  • ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం: చంద్రబాబు
  • తుపాను ప్రభావంతో వేలమంది నిరాశ్రయులయ్యారు: చంద్రబాబు
  • తీరం వెంబడి గాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది: చంద్రబాబు
  • బాధితులకు తెదేపా నాయకులు, కార్యకర్తలు సాయం అందించాలి: చంద్రబాబు
  • లోతట్టు ప్రాంతాల్లోని వారికి నిత్యావసర సరకులు అందించాలి: చంద్రబాబు
  • ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
  • విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
  • ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలి: చంద్రబాబు

12:03 September 27

గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన సూరమ్మ(70)

  • విజయనగరం: బొండపల్లి మండలం తమాటాడాలో విషాదం
  • గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన సూరమ్మ(70)

12:01 September 27

చెట్టుపడి అల్లంపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూలిన ప్రహరీగోడ

  • విశాఖ: అనంతగిరి వద్ద ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్టు
  • విశాఖ: అంబులెన్స్ సహా నిలిచిన ఇతర వాహనాలు
  • చెట్టుపడి అల్లంపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూలిన ప్రహరీగోడ

11:31 September 27

తుపాను ప్రభావం, వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష

  • కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్
  • తుపాను ప్రభావం, వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష
  • జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లతో చర్చిస్తోన్న సీఎం
  • తుపాను సహాయ కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం

11:20 September 27

సింహాద్రి అప్పన్న ఆలయానికి వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లు మూసివేత

  • విశాఖ: సింహాచలం ఘాట్‌రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
  • అప్పన్న ఆలయానికి వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లు మూసివేత
  • సింహాద్రి ఆలయం ఘాట్‌రోడ్డుపై రాళ్లను తొలగిస్తున్న సిబ్బంది

11:14 September 27

గదబపేటలో చెట్టు పడి వృద్ధుడు మృతి

విజయనగరం: బొండపల్లి మం. గదబపేటలో చెట్టు పడి వృద్ధుడు మృతి

10:51 September 27

అత్యధికంగా కడియంలో 13.72 సెం.మీ. వర్షపాతం

  • తూ.గో. జిల్లాలో సగటున 7.62 సెం.మీ. వర్షపాతం నమోదు
  • తూ.గో.: అత్యధికంగా కడియంలో 13.72 సెం.మీ. వర్షపాతం
  • తూ.గో.: ఎటపాకలో అత్యల్పంగా 1.4 సెం.మీ. వర్షపాతం

10:48 September 27

సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

  • సాలూరు నుంచి సిమిలిగూడా జాతీయ రహదారిలో నిలిచిన రాకపోకలు
  • రాళ్లగెడ్డ వద్ద రహదారిపై వరద చేరిక, సాలూరు నుంచి నిలిచిన రాకపోకలు
  • సాలూరు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు

10:47 September 27

మండవల్లిలో 7.24 సెం.మీ., కైకలూరులో 6.72 సెం.మీ.

  • కృష్ణా: గుడివాడలో 4.32 సెం.మీ., నందివాడలో 5.64 సెం.మీ.
  • కృష్ణా: పెదపారుపూడిలో 3.76 సెం.మీ., పామర్రులో 2.78 సెం.మీ.
  • కృష్ణా: గుడ్లవల్లేరులో 3.92 సెం.మీ., ముదినేపల్లిలో 4.54 సెం.మీ.
  • కృష్ణా: మండవల్లిలో 7.24 సెం.మీ., కైకలూరులో 6.72 సెం.మీ.
  • కృష్ణా: కలిదిండిలో 5.68 సెం.మీ. వర్షపాతం నమోదు

10:41 September 27

ఆచంటలో 18, పోడూరులో 17 సెం.మీ. వర్షపాతం

  • ప.గో. జిల్లాలో అత్యధికంగా 19 సెం.మీ. వర్షపాతం నమోదు
  • ప.గో.: 18 మండలాల్లో 10 సెం.మీ. వర్షపాతం నమోదు
  • ప.గో.: ఆచంటలో 18, పోడూరులో 17 సెం.మీ. వర్షపాతం
  • ప.గో. జిల్లాలో సగటున 9 సెం.మీ. వర్షపాతం నమోదు

10:19 September 27

మామిడికుదురు మండలంలో వర్షానికి నిలిచిన విద్యుత్ సరఫరా

  • తూ.గో.: రాజవొమ్మంగి వద్ద వట్టిగెడ్డ జలాశయం పొర్లు కాల్వ ఉద్ధృతి
  • తూ.గో.: మామిడికుదురు మండలంలో వర్షానికి నిలిచిన విద్యుత్ సరఫరా

10:14 September 27

కనితి బస్టాప్ నుంచి కూర్మన్నపాలెం వెళ్లే వాహనాలు దారిమళ్లింపు

  • విశాఖ: కూర్మన్నపాలెం గేట్ నుంచి కనితి బస్టాప్‌ వరకు నీట మునక
  • కనితి బస్టాప్ నుంచి కూర్మన్నపాలెం వెళ్లే వాహనాలు దారిమళ్లింపు
  • విశాఖ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అగనంపూడి మీదుగా వాహనాలు మళ్లింపు

10:12 September 27

రహదారిపై చెట్లను స్థానికుల సాయంతో తొలగిస్తున్న పోలీసులు

  • విశాఖ: పాడేరు ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్లు
  • రహదారిపై చెట్లను స్థానికుల సాయంతో తొలగిస్తున్న పోలీసులు

10:03 September 27

పెద్దేరు జలాశయం 4 గేట్లు ఎత్తి 9,747 క్యూసెక్కులు విడుదల

  • విశాఖ: మాడుగుల మండలం పెద్దేరు జలాశయానికి వరద
  • పెద్దేరు జలాశయం 4 గేట్లు ఎత్తి 9,747 క్యూసెక్కులు విడుదల

10:00 September 27

జి.కె.వీధి-సీలేరు మధ్య నిలిచిన రాకపోకలు

  • విశాఖ: జి.కె.వీధి మం. లంకపాకలు వంతెన పైనుంచి వరద
  • విశాఖ: జి.కె.వీధి-సీలేరు మధ్య నిలిచిన రాకపోకలు

09:58 September 27

ఎర్రబంధ చెరువు పొంగి చుక్కవలసలోకి వరద

  • విజయనగరం: గరివిడి మండలం చుక్కవలసలో పొంగిన చెరువు
  • విజయనగరం: ఎర్రబంధ చెరువు పొంగి చుక్కవలసలోకి వరద
  • విజయనగరం: సాలూరు మం. మామిడిపల్లి వద్ద వంతెనపై నుంచి వరద
  • విజయనగరం: గంట్యాడ మం. నరవ రామవరం రహదారిపై వరద

09:51 September 27

ప్రధాన రహదారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి గ్రామస్థుల నిరసన

  • కృష్ణా: గన్నవరం మండలం సూరంపల్లిలో గ్రామస్థుల ఆందోళన
  • కృష్ణా: ఇళ్లలోకి నీరు చేరినా అధికారులు పట్టించుకోవట్లేదని నిరసన
  • సమస్య పరిష్కారంలో పంచాయతీ అధికారుల జాప్యంపై ఆగ్రహం
  • ప్రధాన రహదారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి గ్రామస్థుల నిరసన
  • హనుమాన్ జంక్షన్ వద్ద జలమయమైన 16వ జాతీయ రహదారి
  • కృష్ణా: ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు, చాట్రాయి మండలాల్లో వర్షం

09:50 September 27

నర్సీపట్నం నుంచి తెలంగాణ, ఒడిశాకు నిలిచిన రాకపోకలు

సింహాచలం మెట్ల మార్గంలో వరదనీటి ఉద్ధృతి
  • విశాఖ: జి.కె.వీధి మం. లంకపాకల వద్ద వంతెన పైనుంచి వరద
  • నర్సీపట్నం నుంచి తెలంగాణ, ఒడిశాకు నిలిచిన రాకపోకలు
  • జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా

09:49 September 27

ఉదయం 10.30 గం.కు శ్రీకాకుళం రానున్న సీఎస్‌ ఆదిత్యనాథ్

హనుమంతపురంలో రోడ్డుపై భారీగా వరదనీరు
  • శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం
  • శ్రీకాకుళం సహా జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • ఉదయం 10.30 గం.కు శ్రీకాకుళం రానున్న సీఎస్‌ ఆదిత్యనాథ్
  • కలెక్టరేట్ నుంచి సీఎం నిర్వహించే సమీక్షలో పాల్గొననున్న సీఎస్‌
  • ఒడిశాలో కురిసిన వర్షాలకు నాగావళి, వంశధారలకు వరద
  • శ్రీకాకుళం: హిరమండలం గొట్టా బ్యారేజీ నుంచి నీటి విడుదల
  • శ్రీకాకుళం: మడ్డువలస ప్రాజెక్టులో భారీగా వరద
  • సువర్ణముఖి, వేగావతి నుంచి మడ్డువలస ప్రాజెక్టుకు వరద
  • మడ్డువలస నుంచి ప్రాజెక్టు నుంచి నాగావళిలోకి వరద ఉద్ధృతి
  • శ్రీకాకుళం: నాగావళి ఆనకట్ట వద్ద పెరుగుతున్న వరద ఉద్ధృతి

09:47 September 27

ట్రాక్టర్ సహాయంతో అంబులెన్సును బయటకు తీసిన స్థానికులు

  • ప.గో.: కుక్కునూరు మండలంలో వాగులో నిలిచిన 108 అంబులెన్స్‌
  • ప.గో.: ట్రాక్టర్ సహాయంతో అంబులెన్సును బయటకు తీసిన స్థానికులు
  • ప.గో.: బుట్టాయగూడెం మం. వీరన్నపాలెం వద్ద జల్లేరు వాగు ఉద్ధృతి

09:13 September 27

మైలవరంలో డ్రెయినేజీలోని నీరు రహదారిపై ప్రవాహం

  • కృష్ణా: మైలవరంలో ఎడతెరిపి లేని వర్షానికి రహదారులు జలమయం
  • కృష్ణా: మైలవరంలో 8.62 సెం.మీ. వర్షపాతం నమోదు
  • కృష్ణా: మైలవరంలో డ్రెయినేజీలోని నీరు రహదారిపై ప్రవాహం

09:11 September 27

అమలాపురంలో అత్యధికంగా 11.84 సెం.మీ. వర్షపాతం

  • తూ.గో. జిల్లాలో 16 మండలాల్లో వర్షం
  • అమలాపురంలో అత్యధికంగా 11.84 సెం.మీ. వర్షపాతం

09:02 September 27

వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం

గన్నవరం విమానాశ్రయం జలమయం.. గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం
  • కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో సర్వీసులు ఆలస్యం
  • వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
  • సుమారు గంట నుంచి గాల్లోనే చక్కర్లు కొడుతున్న బెంగళూరు ఇండిగో సర్వీస్
  • ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న విమానాశ్రయ అధికారులు

08:43 September 27

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల సూచన

  • తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ ‌తుపాను
  • రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటిన గులాబ్ తుపాను
  • తీరం దాటిన తర్వాత బలహీనపడిన గులాబ్‌ తుపాను
  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తీవ్ర వాయుగుండం కేంద్రీకృతం
  • 6 గంటల్లో మరింత బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం
  • ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు
  • రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • కొన్నిచోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడి
  • ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం
  • మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు
  • ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల సూచన

08:42 September 27

పొలాల్లోని నీటిని తొలగించేందుకు అన్నదాతల అవస్థలు

  • కృష్ణా: గన్నవరం పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం
  • కృష్ణా: వర్షం ధాటికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు
  • కృష్ణా: జాతీయ రహదారిపై వాహనదారుల ఇక్కట్లు
  • వి.ఎన్‌.పురం, ముస్తాబాదలో కాలనీల్లోకి చేరిన వరద నీరు
  • కృష్ణా: పొలాల్లోని నీటిని తొలగించేందుకు అన్నదాతల అవస్థలు

08:30 September 27

రహదారిపై భారీ వృక్షం విరిగి పడటంతో స్తంభించిన ట్రాఫిక్

  • కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు
  • పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిపై విరిగిపడిన భారీ వృక్షం
  • కృష్ణా: రహదారిపై అడ్డంగా పడటంతో భారీగా స్తంభించిన ట్రాఫిక్
  • కృష్ణా: చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన పోలీసులు

08:28 September 27

మరో 6 గంటల్లో మరింత బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం

  • తీవ్ర వాయుగుండంగా మారిన గులాబ్ తుపాను
  • రాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటిన గులాబ్ తుపాను తీరం దాటిన తర్వాత బలహీనపడిన గులాబ్‌ తుపాను
  • ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల మీద కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం
  • మరో 6 గంటల్లో మరింత బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం
  • వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు
  • కొన్నిచోట్ల కుంభవృష్టి ఉంటుందని వాతావరణశాఖ వెల్లడి

08:27 September 27

వాగు ఉద్ధృతి వల్ల 4 గ్రామాలకు రాకపోకలు బంద్

  • విశాఖ: అనకాపల్లి మం.రాజుపాలెం వద్ద ఉద్ధృతంగా ఉప్పుగడ్డ వాగు
  • వాగు ఉద్ధృతి వల్ల 4 గ్రామాలకు రాకపోకలు బంద్

08:24 September 27

విజయనగరంలో ఉదయం వరకు 6.9 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు

  • గులాబ్ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షం
  • జిల్లాలో ఉదయం వరకు 6.9 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు
  • గజపతినగరం. 20 సెం.మీ., నెల్లిమర్లలో సెం.మీ. వర్షపాతం నమోదు
  • పూసపాటిరేగ15 సెం.మీ., గరివిడిలో 14 సెం.మీ. వర్షపాతం
  • భోగాపురం 13 సెం.మీ., విజయనగరం, డెంకాడలో 12 సెం.మీ. వర్షం
  • కొత్తవలస 11 సెం.మీ., సాలూరు, రామభద్రపురంలో 10 సెం.మీ. వర్షం
  • భారీ వర్షాలకు తోటపల్లి, ఆండ్ర జలాశయాల్లోకి వరద ప్రవాహం

08:03 September 27

తూ.గో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

  • తూ.గో.: కోనసీమ వ్యాప్తంగా జోరుగా వర్షాలు
  • తూ.గో.: పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

08:01 September 27

వర్షానికి నీటమునిగిన దుర్గానగర్, నాయుడుతోట ప్రాంతాలు

  • విశాఖ: వర్షానికి నీటమునిగిన దుర్గానగర్, నాయుడుతోట ప్రాంతాలు

08:00 September 27

గుంటూరు జిల్లావ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచి వర్షం

  • గుంటూరు జిల్లావ్యాప్తంగా వర్షాలు
  • గుంటూరులో ఉదయం 5 గంటల నుంచి వర్షం
  • గుంటూరు: బాపట్ల, రేపల్లె, నిజాంపట్నంలో భారీ వర్షాలు
  • గుంటూరు: భట్టిప్రోలు, చుండూరు మండలాల్లో మోస్తరు వర్షం
  • గుంటూరు: వేమూరు, మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో వర్షం

07:47 September 27

రెండు తాటిచెట్లు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

  • విశాఖ: వర్షానికి పెందుర్తి బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద కూలిన గోడ
  • విశాఖ: పెందుర్తి అక్కిరెడ్డిపాలెం విద్యుత్ ఉపకేంద్రం వద్ద విరిగిపడిన చెట్లు
  • విశాఖ: రెండు తాటిచెట్లు విరిగిపడి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

07:46 September 27

ఇంటిపై కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

  • విశాఖ: పెందుర్తి మండలం వేపగుంటలో విషాదం
  • విశాఖ: ఇంటిపై కొండచరియలు విరిగిపడి మహిళ మృతి

07:45 September 27

ద్వారకానగర్‌లో 2 తాటాకు ఇళ్లు నేలమట్టం

  • విశాఖ: చోడవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం
  • విశాఖ: బాలాజీనగర్‌లో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  • విశాఖ: ద్వారకానగర్‌లో 2 తాటాకు ఇళ్లు నేలమట్టం

07:44 September 27

భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ

  • విశాఖ ఏజన్సీలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
  • విశాఖ: భారీ వర్షానికి పొంగి ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ

06:58 September 27

ప.గో జిల్లాలో ఆర్టీసీ డిపోలకే పరిమితమైన 750 బస్సులు

  • ప.గో.: 8 ఆర్టీసీ డిపోల పరిధిలో కదలని బస్సులు
  • ప.గో.: ఆర్టీసీ డిపోలకే పరిమితమైన 750 బస్సులు

06:56 September 27

ఏలూరు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో వర్షాలు

  • ప.గో.: తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షాలు
  • ప.గో.: ఏలూరు, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో వర్షాలు
  • ప.గో.: జంగారెడ్డిగూడెం, కొవ్వూరు ప్రాంతాల్లో వర్షాలు

06:55 September 27

తూర్పు గోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం

  • తూ.గో. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
  • తూ.గో. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం

06:54 September 27

పెదగంట్యాడ పరిసర ప్రాంతాల్లో నీటమునిగిన ఇళ్లు

  • విశాఖ: పెదగంట్యాడ హౌసింగ్‌ బోర్డులో ఇళ్లలోకి వర్షపు నీరు
  • విశాఖ: పెదగంట్యాడ పరిసర ప్రాంతాల్లో నీటమునిగిన ఇళ్లు

06:53 September 27

ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

  • తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన గులాబ్ ‌తుపాను
  • గడిచిన 6 గంటల్లో వాయుగుండంగా బలహీనపడిన తుపాను
  • గులాబ్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
  • రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
  • గులాబ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలం
  • మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల హెచ్చరికలు
  • ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారుల సూచన

06:52 September 27

భారీ వర్షానికి విశాఖలో లోతట్టుప్రాంతాలు జలమయం

  • విశాఖలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
  • విశాఖ: గులాబ్‌ తుపాను ప్రభావంతో వర్షం
  • భారీ వర్షానికి విశాఖలో లోతట్టుప్రాంతాలు జలమయం
  • విశాఖ: జ్ఞానాపురంలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
  • విశాఖ: రాత్రి నుంచి నిలిచిన విద్యుత్‌ సరఫరా

06:50 September 27

గులాబ్ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు

  • కృష్ణా: గులాబ్ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు
  • అర్ధరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపిలేని వర్షం
  • వర్షానికి విజయవాడలో లోతట్టుప్రాంతాలు జలమయం

06:48 September 27

లాబ్‌ తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు

గాలివానకు పడిపోయిన చెట్టు
  • విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు
  • విజయనగరం: గులాబ్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు
  • పూసపాటిరేగ, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం
  • విజయనగరం: భోగాపురం మండలంలో నేలకొరిగిన భారీ వృక్షాలు
  • నెల్లిమర్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిలో కూలిన చెట్లు
  • విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపై నిలిచిన వాహనాల రాకపోకలు
  • చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన అధికారులు

06:47 September 27

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

  • తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎక్కువ నష్టం జరగలేదు: కలెక్టర్
  • నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి: కలెక్టర్
  • పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది: కలెక్టర్
  • అన్ని శాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
  • జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి: కలెక్టర్
  • 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్
  • 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్‌కు తెలపాలి: కలెక్టర్
  • కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557: కలెక్టర్
  • జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933: కలెక్టర్

06:45 September 27

గులాబ్ తుపాను కారణంగా పలు రైళ్లు పాక్షికంగా రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు

  • గులాబ్ తుపాను వల్ల నేడు పలు రైళ్లు రద్దు
  • పలు రైళ్లు పాక్షికంగా రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే
  • ఇవాళ్టి తిరుపతి - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
  • ఇవాళ్టి చెన్నై సెంట్రల్ - పూరి ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
  • ఇవాళ్టి హెచ్.ఎస్. నాందేడ్- సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
  • ఇవాళ్టి కేఎస్ఆర్ బెంగళూరు- భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు
  • ఇవాళ్టి యశ్వంత్‌పూర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

06:43 September 27

శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాను తీరం దాటింది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

  • శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాను తీరం దాటింది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య తుపాను తీరం దాటింది: కలెక్టర్
  • ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎక్కువ నష్టం జరగలేదు: కలెక్టర్
  • నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి: కలెక్టర్
  • పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది: కలెక్టర్
  • అన్ని శాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
  • జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయి: కలెక్టర్
  • ఆరుగురు మత్స్యకారుల్లో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు: కలెక్టర్
  • మత్స్యకారులు వజ్రపుకొత్తూరు మం. మంచినీళ్లపేట వాసులు: కలెక్టర్
  • ఒక మత్స్యకారుడి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది: కలెక్టర్
  • 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్
  • 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
  • ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్‌కు తెలపాలి: కలెక్టర్
  • కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557: కలెక్టర్
  • జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933: కలెక్టర్
  • తుపాను కారణంగా శ్రీకాకుళంలో ఇవాళ నిర్వహించనున్న స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్

06:20 September 27

ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేల రాలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

  • గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
  • శ్రీకాకుళం జిల్లాలో తీరం దాటిన గులాబ్‌ తుపాను
  • కళింగపట్నానికి ఉత్తరంగా 20 కి.మీ దూరంలో తీరం దాటిన తుపాను
  • రాత్రి 9.30 గంటలకు తీరం తాకిన గులాబ్‌ తుపాను
  • తీరాన్ని తాకిన 3 గంటల తర్వాత తీరం దాటిన తుపాను
  • తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు
  • ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేల కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
  • శ్రీకాకుళం జిల్లాలో పలు చోట్ల నేలకొరిగిన కొబ్బరిచెట్లు, భారీ వృక్షాలు
  • నాలుగు మండలాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం
  • మందస మండలంలో కొబ్బరిచెట్టు పడి బాలుడికి తీవ్రగాయాలు
  • ఈదురుగాలులకు ఒడిశా నుంచి వస్తున్న మత్స్యకారుల పడవ బోల్తా
  • సురక్షితంగా బయటపడిన పడవలోని ఐదుగురు మత్స్యకారులు
  • మరో మత్స్యకారుడు సముద్రంలో గల్లంతు
  • విజయనగరం జిల్లాలోనూ ఎడతెరిపిలేని వర్షం
  • పూసపాటిరేగ, భోగాపురంలోని తీరప్రాంతాల్లో ఎగిసిపడుతున్న అలలు
  • ముక్కాంలో 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
Last Updated : Sep 27, 2021, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details