Rain in hyderabad: ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులకు గత కొన్ని రోజులుగా ఉన్న వేడి వాతావరణం నుంచి ఉపశమనం లభించింది.
నగరంలోని ఫలక్‌నుమా, కాలాపత్తర్, చాంద్రాయణగుట్ట బహదూర్‌పురా, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్, నాచారం, కాప్రాలోనూ వరుణుడు దంచికొట్టాడు. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.