ఉదయం నుంచి మండుటెండతో ఇబ్బంది పడ్డ హైదరాబాద్ నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది.
ఈ ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్‌లో చిరుజల్లులు కురిశాయి. వాహనదారులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది.