బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన - Hyderabad Weather
బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం తడిసిముద్దయింది. దీనివల్ల వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
![భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన rain that flooded hyderabad city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8404567-784-8404567-1597318791719.jpg)
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన
భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన
కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్ సహా పలు ప్రాంతాల్లో కురిసిన వానతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందిపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు, వివిధ పనులకు వెళ్లే ప్రజలు తడిసి ముద్దయ్యారు. ట్యాంక్‌బండ్‌పై కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.