RAIN AT SECUNDERABAD: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడ్ పల్లి, చిలకలగూడ, బోయిన్పల్లిలో వాన పడింది. ఎండల వేడిమి తాళలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. జీడిమెట్ల, గాజులరామారం, సూరారంలోనూ వాన చినుకులు కురిశాయి.
నగరంలోని తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షం కురిసింది. నగరంలో చిరు జల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఇదీ చూడండి: