మధ్యప్రదేశ్ దక్షిణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ప్రకటించింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని తెలిపింది. కర్ణాటక మీదుగా 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరు, కడప జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం...నేడు, రేపు మోస్తరు వర్షాలు - మధ్యప్రదేశ్ ఉపరితల ద్రోణి
మధ్యప్రదేశ్ దక్షిణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర, దక్షిణ కోస్తాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం