పాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ నిర్వహణ కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో కొన్ని గంటల పాటు ఆన్లైన్లో టికెట్ల జారీ నిలిచిపోనుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 28 అర్దరాత్రి 11.45 నుంచి రాత్రి 2 గంటల వరకు అలాగే.. 29న రాత్రి 11.45 గంటల నుంచి 2 గంటల వరకు సర్వర్ నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. దీనివల్ల మొత్తం 2 గంటల 15 నిమిషాల పాటు స్టేషన్లలో, ఆన్లైన్లో టికెట్ల రిజర్వేషన్, విచారణ, టికెట్ల రద్దు తదితర సేవలు నిలిచిపోతాయని అధికారులు వెల్లడించారు.
సర్వర్ అప్డేట్.. నెలాఖర్లో రైల్వే టికెట్ బుకింగ్ సేవలకు అంతరాయం - online tickets booking
పాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ నిర్వహణ కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో కొన్ని గంటల పాటు ఆన్లైన్లో టికెట్ల జారీ నిలిచిపోనుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మొత్తం 2 గంటల 15 నిమిషాల పాటు స్టేషన్లలో, ఆన్లైన్లో టికెట్ల రిజర్వేషన్, విచారణ, టికెట్ల రద్దు తదితర సేవలు నిలిచిపోతాయని అధికారులు వెల్లడించారు.
railway reservation services