రాష్ట్రానికి ఆక్సిజన్(Oxygen) ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 2,125.6 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(Oxygen) సరఫరా చేసినట్లు రైల్వే(railway)శాఖ వెల్లడించింది. పదహారు రోజుల్లో 33 ఆక్సిజన్(Oxygen) ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఎల్ఎమ్ఓ సరఫరా చేసినట్లు వెల్లడించింది.
గుంటూరు, కృష్ణపట్నం, సింహాచలం, తాడిపత్రికి ద్రవ రూప వైద్య ఆక్సిజన్(Oxygen)ను చేరవేసింది. గుంటూరుకు 720.9 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నానికి 756.7 మెట్రిక్ టన్నులు, సింహాచలానికి 360 మెట్రిక్ టన్నులు, తాడిపత్రికి 368 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా చేసింది.
రాష్ట్రానికి కావాల్సిన వైద్య ఆక్సిజన్(Oxygen) అవసరాలను తీర్చడానికి తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి ఆక్సిజన్(Oxygen) ఎక్స్‌ప్రెస్‌లు నడిచాయి. ఒడిసా నుంచి 15 రైళ్లు, జార్ఖండ్ నుంచి 9 రైళ్లు, గుజరాత్ నుంచి 7 రైళ్లు, పశ్చిమ బంగా నుంచి 2 రైళ్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ కు వైద్య ఆక్సిజన్(Oxygen) సరఫరా చేయడంలో శ్రమిస్తున్న అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్(Oxygen) సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్‌పై.. విచారణ వాయిదా