ఆర్థిక పరిస్థితులు సరిగా లేక.. చదువుకు భారమై రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఫరూక్ నగర్‌కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. దిల్లీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని మృతిపట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ ద్వారా.. భాజపా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది." అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.