ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సర్పంచ్ భర్తే.. వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించాడు - జగిత్యాల జిల్లా వార్తలు

కరోనా కాలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబసభ్యులే జంకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మృతి చెందిన ఓ వృద్ధుడి అంత్యక్రియలకు అయినవారు ముందుకు రాకపోవడంతో సర్పంచ్ భర్తే నిర్వహించాడు.

sarpanch-husband-conducted-funeral-for-old-man
వృద్ధుడుకి అంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్ భర్త

By

Published : Jul 29, 2020, 11:34 PM IST

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రఘురామల కోట వద్ద అనారోగ్యంతో ఓ వృద్ధుడు మృతి చెందగా మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. గ్రామ సర్పంచ్ భర్త అతనికి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.

సారంగపూర్‌ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన కందె మాని (65) జగిత్యాల ప్రాంతంలో యాచిస్తూ జీవనం సాగించేవాడు. అనారోగ్యంతో రోడ్డు పక్కన మృతి చెందాడు. కరోనా వైరస్‌ భయంతో అతని కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రాలేదు. రేచపల్లికి చెందిన సర్పంచ్ భర్త ఎడమల లక్ష్మారెడ్డి... వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

ఇదీ .చదవండి:తెలంగాణ: మరో 1,764 మందికి సోకిన కరోనా

ABOUT THE AUTHOR

...view details