ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 8, 2020, 3:20 PM IST

ETV Bharat / city

కొడాలి నానికి రఘురామకృష్ణరాజు అభినందనలు.. ఎందుకంటే..!

రాజధానిని పూర్తిస్థాయిలో తరలించాలని చూస్తున్నారని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆగ్రహించారు. అమరావతిపై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అన్నారు.

raghuramkrishnaraju comments on ysrcp govt over capital
raghuramkrishnaraju comments on ysrcp govt over capital

అమరావతి నుంచి విశాఖకు మొత్తంగా రాజధానిని తరలించాలని చూస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. కేసులు ఉపసంహరించుకోకుంటే శాసన రాజధానిని కూడా తరలిస్తామన్నట్లు ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. రాజధాని తరలింపుపై బాహాటంగానే ప్రభుత్వ వైఖరిని కొడాలి నాని ప్రకటించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేసినందుకు కొడాలి నానికి అభినందనలన్నారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీపై రైతులకు సందేహాలు, అపోహలు ఉన్నాయని చెప్పారు.

విద్యుత్ వినియోగంపై లెక్క ఉండాలని కేంద్రం చెప్పిందన్నారు. రైతుల ఆందోళనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మీటర్ల పెట్టి వాటికి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకం కడపలో మొదలుపెట్టాలని ఎంపీ కోరారు.

అక్షరాస్యతలో ఏపీ చివరిస్థానంలో నిలవడం విచారకరం. నాపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించేవారికి వైకాపాలో స్థానం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. నాపై అనర్హత వేటు వేయాలన్న ఫిర్యాదుపై పునరాలోచించుకోవాలి. అంతర్వేది విషయంలో మంచి పోలీసు అధికారిని నియమిస్తే 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటారు. సిట్‌ ఏర్పాటుచేసి విచారించి దోషులపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది. నిమ్మగడ్డ అంశంలో ఓ ఎంపీ ఫిర్యాదు మేరకు అనాలోచితంగా విచారణ చేపట్టారు. అనవసరపు విషయాల జోలికి ప్రభుత్వం వెళ్లకుండా సీఎం చూసుకోవాలి.

- రఘురామకృష్ణరాజు, ఎంపీ

--

ఇదీ చదవండి:

'అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని సీఎంకు చెప్పా'

ABOUT THE AUTHOR

...view details