ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో ముందుకెళ్దాం' - raghurama krishnarajau comments on jagan

ప్రజాధనం వృథా తప్ప రాష్ట్ర ప్రభుత్వం సాధించేదేమీ లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. న్యాయం అమరావతి రైతుల పక్షాన ఉందన్నారు. కొన్ని వర్గాలపై కోపంతో చేసిన పనిగా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

raghurama krishnarajau comments on supreme court decision
రఘురామకృష్ణరాజు

By

Published : Aug 26, 2020, 6:15 PM IST

రఘురామకృష్ణరాజు

'సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో ముందుకెళ్దాం.. అమరావతే రాజధాని' అని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఆయన... ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందని చెప్పారు. ప్రజాధనం వృథా తప్ప రాష్ట్ర ప్రభుత్వం సాధించేదేమీ లేదని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. న్యాయం అమరావతి రైతుల పక్షాన ఉందని స్పష్టం చేశారు. కేవలం కొన్ని వర్గాలపై కోపంతో చేసిన పనిగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

అమరావతి రైతులు కౌలు కోసం నిరసన చేస్తే అరెస్టు చేస్తున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే వైకాపా నేతలు బెదిరింపులు, పోలీసుల కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. శిరోముండనం కేసులో చర్యలు ఉంటాయని సీఎం చెప్పడం అభినందనీయమన్న ఎంపీ... ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని పేర్కొన్నారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచానని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details