వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, తృణమూల్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీ శిశిర్ అధికారి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్లను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపారు. రఘురామకృష్ణరాజుపై వైకాపా లోక్‌సభ విప్ మార్గాని భరత్, శిశిర్ అధికారిపై టీఎంసీ లోక్‌సభాపక్ష నేత సుదీప్ బంధోపాధ్యాయ ఇచ్చిన పిటిషన్లపై విచారణ జరిపి, ప్రాథమిక నివేదిక సమర్పించాలని ప్రివిలేజ్ కమిటీని స్పీకర్ కోరినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ‘రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని 6వ పేరాగ్రాఫ్ కింద, అలాగే లోక్‌సభ సభ్యుల (పార్టీ ఫిరాయింపుల కింద అనర్హులుగా ప్రకటించడం) నిబంధనలు- 1985 కింద ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్‌విప్ మార్గాని భరత్ ఇచ్చిన పిటిషన్‌ను ఈనెల 27న స్పీకర్ ఓంబిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపారు. లోక్‌సభ సభ్యుల అనర్హత నిబంధనల్లోని రూల్ 7(4)ని అనుసరించి ప్రాథమిక విచారణ జరపాలని అందులో కోరారు’ అని బులిటెన్‌లో పేర్కొన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!