కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
18:28 August 16
తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ... కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, ,21 ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు... కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌భల్లాకు ఫిర్యాదు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ తన మొబైల్ నెంబర్‌ను ట్యాప్ చేసిందంటూ లేఖలో పేర్కొన్నారు. కొంతకాలంగా తన ఫోన్ తరచుగా అవాంతరాలకు గురవుతోందని వివరించారు. తన మొబైల్‌ను ట్యాప్ చేయడం ద్వారా... రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, ,21 ఉల్లంఘనకు పాల్పడ్డారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... 'అప్రమత్తంగా ఉండి బాధితులను ఆదుకోవాలి'