రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించి ఆంగ్ల మధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం ప్రతి తెలుగువాడి గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నవ సూచనల పేరిట ముఖ్యమంత్రి జగన్‌కు మరో లేఖ రాశారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన, తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రఘురామ లేఖ రాశారు.
"అ అంటే అమ్మ,… ఆ అంటే ఆవు.. ఇ అంటే ఇల్లు… అనే పచ్చని పసిడి తెలుగు పదాలను చెరిపేయవదు. పసి మనసులను అమ్మ నుంచి, అమ్మ మాట్లాడే భాష నుంచి దూరం చేయవద్దు. మధురమైన తెలుగు నుంచి మన భావితరాలు దూరం జరిగిపోతున్నాయన్న బాధతో భాషాప్రియులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పరంగానో మరే అవసరం కోసమో ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మాత్రమే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగం ఏం చెబుతున్నదో వివరం చూడండి. తెలుగు భాషాభిమానుల మనోవేదన ఆలకించండి" - ఎంపీ రఘురామ