ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామకృష్ణరాజు జైలుకెళ్లడం ఖాయం: నందిగం సురేశ్‌ - Nandigam Suresh comments on RaghuRama

రఘురామకృష్ణరాజుపై ఎంపీ నందిగం సురేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణరాజు జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టేశారని వివరించారు.

నందిగం సురేశ్‌
నందిగం సురేశ్‌

By

Published : Apr 7, 2021, 2:27 PM IST

నందిగం సురేశ్‌

రఘురామకృష్ణరాజు కచ్చితంగా జైలుకెళ్లడం ఖాయమని.. వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌ వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజుపైనా సీబీఐ కేసులు ఉన్నాయని వివరించారు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌ వేశారన్న ఎంపీ నందిగం.. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను సాయంత్రానికే కొట్టేశారని వెల్లడించారు. జగన్‌ రాముడితో సమానం కాబట్టే ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని నందిగం సురేశ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details