ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో అమ్మే మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు: రఘురామకృష్ణరాజు - news on raghu ram krishna raju

రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే హరీ అంటారని నిపుణులంటున్నారని రాఘురామకృష్ణరాజు అన్నారు.

raghu rama krishna raju on liqour brands in andhra pradesh
రఘురామకృష్ణరాజు

By

Published : Aug 27, 2020, 1:33 PM IST

ఆంధ్రాలో లిక్కర్‌ బ్రాండ్లు విచిత్రంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణలో దొరికే మద్యం రోజూ తాగితే 20 ఏళ్లకు లివర్‌ పాడవుతుందని నిపుణులు అంటున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే హరీ అంటారని నిపుణులంటున్నారని పేర్కొన్నారు.

లీజుకు ఎవరు తీసుకున్నారోగానీ ఎస్పీవై రెడ్డి కర్మాగారంలో మద్యం బ్రాండ్లు తయారుచేస్తున్నారుని రఘురామ కృష్ణరాజు అన్నారు. పలు రకాల మోడళ్లలో మద్యం బ్రాండ్లన్నీ ఒకేచోట తయారుచేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

ABOUT THE AUTHOR

...view details