Director Raghavendra rao: తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై దర్శకేంద్రుడు రాఘవేందరరావు రాసిన తొలి పుస్తకం 'నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ'. ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు సుధామూర్తి చేతుల మీదుగా ఇటీవలే ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. తెలంగాణలో హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతలు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావుతో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆయన సినిమాల విశిష్టతను గుర్తు చేసుకున్నారు.
రాఘవేంద్రుడి 'ప్రేమలేఖ'లో దర్శకుల సందడి..మీరూ చూసేయండి... - raghavender rao showreel released
Director Raghavendra rao: దర్శకేంద్రుడు రాఘవేందరరావు తన సినీ ప్రస్థానంపై రాసిన తొలి పుస్తకాన్ని ఇటీవలే లాంఛనంగా ఆవిష్కరించారు.తెలంగాణలోని హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతలు హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఓ 3 నిమిషాల వీడియోను రాఘవేంద్రరావు బృందం విడుదల చేసింది. ఆద్యంతం నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Director Raghavendra
ఆద్యంతం నవ్వులు పూయిస్తూ.. సందడిగా సాగిన ఈ వేడుకకు సంబంధించిన 3 నిమిషాల వీడియోను రాఘవేంద్రరావు బృందం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను త్వరలోనే అభిమానులతో పంచుకోనున్నట్లు తెలిపింది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుకలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, లెక్కల మాస్టార్ సుకుమార్లు చెరో జట్టుగా ఏర్పడి పుస్తకావిష్కరణ వేడుకను మరింత సరదాగా మలిచారు.
ఇవీ చూడండి..