స్నేహితురాలి వద్ద రూ. 3.10 లక్షలు కాజేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రానికి చెందిన పూలకుంట శ్రీనివాసులు, ఉదయ్ మనీశ్‌లు ఉద్యోగం కోసం హైదరాబాద్‌కి వచ్చారు. అమీర్‌పేట్‌లోని ఓ వసతి గృహంలో ఉంటుండగా వీరికి గణేష్ అనే విద్యార్థి పరిచయమయ్యాడు. గణేష్ స్నేహితురాలైన ఓ యువతికి శ్రీనివాసులు, మనీశ్ దగ్గరయ్యారు. అనంతరం స్నేహంగా మెలిగారు. తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవారు.
నమ్మి ఐడీ నెంబర్ ఇస్తే..
ఓరోజు ఊరికి వెళ్తూ.. తన ఇంట్లో ఉన్న కుక్కపిల్లను తీసుకెళ్లాలని సదరు యువతి వారిని కోరింది. ఆటో ఛార్జీలకు ఐదు వందలు ఇవ్వాలని శ్రీనివాసులు, గణేష్ ఆమెను అడిగారు. అందుకు ఆమె తన వద్ద నగదు లేదని.. ఫోన్ ఇచ్చి నగదు బదిలీ చేసుకోవాలంటూ యూపీఐ ఐడీ చెప్పింది.
గోవాలో విలాసం..