మాస్కు ధరించని వాహనదారులకు ఈ-చలాన్ ద్వారా కూడా జరిమానా విధిస్తున్నట్లు హైదరాబాద్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్కు ధరించని వారిపై చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
మాస్కు లేని వ్యక్తులను పసిగడుతున్న సీసీ కెమెరాలు - rachakonda cp mahesh bhagwat latest news
మాస్కు పెట్టుకోకపోతే ఏముంది... నన్ను ఎవరు చూస్తారులే అనుకుంటే... మీరు తప్పులో కాలేసినట్టే!! మీరు మాస్కు పెట్టుకున్నారా...? లేదా? అనే నిఘా మీపై ఉంటుంది. అదేలా అనుకుంటున్నారా..? మాస్క్ లేనివారిని సీసీ కెమెరాలతో గుర్తించి జరిమానా విధిస్తున్నారు హైదరాబాద్, రాచకొండ పోలీసులు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్
సాధారణంగానే కాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి సదరు వాహనదారునికి ఈ-చలాన్ విధిస్తున్నామన్నారు. కరోనా ఉదృతి దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్ వాడాలని ఆయన కోరారు. కమిషనరేట్ పరిధిలో నిన్న ఒక్కరోజే మాస్కు ధరించని 832 మందిపై కేసులు నమోదు చేశామి వెల్లడించారు.