కొత్త కులాలను కలిపే విధంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లుతో ఎలాంటి లాభం ఉండదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచాలని అన్నారు. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచాలి: ఆర్.కృష్ణయ్య - Andhrapradesh news
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచకుండానే కొత్త కులాలను కలిపే విధంగా పార్లమెంటు ఆమోదించిన బిల్లు వల్ల ఎలాంటి లాభం ఉండదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.
ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్‌లో ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తే పెద్దకులాల ఒత్తిడికి లొంగి వాటిని బీసీల జాబితాలో కలిపే ప్రమాదం ఉంది’ అని ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: