రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ)కు అన్ని జిల్లాల్లో ఉన్న రూ.3,786.15 కోట్ల విలువైన ఆస్తులను ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ)కు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రూ.3,393.65 కోట్ల విలువైన 574.37 ఎకరాల స్థలాలు, రూ.392.50 కోట్ల విలువైన 3.31 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏపీఆర్డీసీ అదనపు ఆదాయ వనరులు సమీకరించుకొని, రహదారుల సదుపాయాలు మెరుగుపరుచుకునేందుకు వినియోగించుకోనుందని గెజిట్‌లో పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ ఆస్తులన్నీ ఆర్డీసీకి బదలాయించేందుకు వీలుగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
ఆర్డీసీకి ఆర్‌అండ్‌బీ ఆస్తులు.. ప్రభుత్వం నిర్ణయం - ఏపీ ఆర్ ఎండ్ బీ నిధులు
రూ.3,786.15 కోట్ల విలువైన రహదారులు భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) ఆస్తులను ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్డీసీ)కు బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రూ.3,393.65 కోట్ల విలువైన 574.37 ఎకరాల స్థలాలు, రూ.392.50 కోట్ల విలువైన 3.31 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి.
ఆర్డీసీకి అదనపు ఆదాయం ఎలా సమకూర్చాలనే దానిపై కొంత కాలం కిందట అధ్యయనం జరిగింది. పలు రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేశారు. రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు, ఖాళీ స్థలాలు లీజులకు ఇవ్వడం, రోడ్లపై హోర్డింగ్‌లకు అనుమతించడం వంటివి గుర్తించారు. ఇందులో భాగంగానే పలు రాష్ట్ర రహదారులపై టోల్ వసూళ్లకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్‌అండ్‌బీ నుంచి వచ్చిన ఆస్తులను తనఖా, లీజులకు ఇచ్చి ఆదాయ వనరుగా మార్చుకోనున్నట్లు తెలిసింది. అయితే.. అధికారుల వాదన మరోలా ఉంది. 2018లో ఆర్‌డీసీ రూ.3 వేల కోట్ల బ్యాంకు రుణం తీసుకోగా.. సంస్థ బ్యాలెన్స్ షీట్ ఆ మేరకు తక్కువగా ఉందని, అందుకే ఆర్‌అండ్‌బీ ఆస్తులన్నీ దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా బ్యాలెన్స్ షీట్ సర్దుబాటుకు వీలు కలుగుతుందని పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:Railway Bonus 2021: రైల్వే ఉద్యోగులకు దసరా కానుక.. 78 రోజుల వేతనం బోనస్