Python On Power Line: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దలో కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం నుంచి కొండచిలువ తీగల పైకెక్కింది. ఆశ్చర్యానికి గురైన అక్కడి రైతులు అటవీశాఖ, విద్యుత్‌శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలగకుండా అప్రమత్తమయ్యారు. హైటెన్షన్ వైర్లు కావడంతో ముందు జాగ్రత్తగా తీగలపై పాకుతున్న కొండచిలువను తాళ్ల సహాయంతో కిందపడేశారు.
హైటెన్షన్ వైర్లయితే నాకేంటంటున్న కొండ చిలువ - python latest news
Python On Power Line తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లపై హల్చల్ చేసింది. హెచ్‌టీ లైన్లపై కొండచిలువ విన్యాసాలను చూసిన రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు అటవీశాఖ, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు.
python
అనంతరం అటవీశాఖ సిబ్బంది కొండచిలువను బంధించి.. సమీపంలోని అడవిలో వదిలారు. సమీపంలో అటవీ ప్రాంతం ఉండటంతో కొండచిలువ వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఇవీ చదవండి: