విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సన్మాన కార్యక్రమానికి పాల్గొనటానికి హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి గురువారం పీవీ సింధు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ భాస్కర్ స్వాగతం పలికారు. ప్రపంచకప్పు గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా ఏపీకి రావటం ఆనందంగా ఉందని సింధు తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పీవీ సింధుకు క్రీడా ప్రాధికార సంస్థ సన్మానం చేయనుంది. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ను, మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా సింధు కలవనుంది.
సీఎం జగన్‌తో పీవీ సింధు మర్యాదపూర్వక భేటీ నేడు - pv_sindhu_will_meet_cm_jagan
ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్‌ను షట్లర్ పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలవనుంది. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది.
pv_sindhu_will_meet_cm_jagan
ఇదీ చదవండి:
Last Updated : Sep 13, 2019, 5:09 AM IST