టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధును హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఘనంగా సన్మానించారు. కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్, అదనపు డీఐజీలు శిఖా గోయల్, అనిల్ కుమార్ తదితర ఉన్నతాధికారులు కరతాళ ధ్వనులు చేస్తూ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా 'ద సెకండ్ వేవ్' పుస్తకాన్ని సింధు ఆవిష్కరించారు. రెండో విడత లాక్డౌన్ సందర్భంగా నిర్వహించిన విధులకు సంబంధించిన వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సింధును పుష్పగుచ్ఛం అందించి సీపీ అంజనీకుమార్ ఆహ్వానించారు.
లాక్డౌన్ సమయంలో పోలీసులు ఎంతో కష్టపడి పని చేశారని పీవీ సింధు కొనియాడారు. ప్రాక్టీస్ కోసం స్టేడియానికి వెళ్లడానికి ఎంతో సహకరించారని.. పాస్ జారీ చేసి తనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వ క్రీడల్లో తాను గెలిచిన కాంస్య పతకాన్ని పోలీసుల సేవకు అంకితం చేస్తున్నానని స్పష్టం చేశారు.
బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర..