టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ.సింధు.. ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. సీఎం జగన్, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న 30లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరపున ఆమెకు అందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
PV. sindhu: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. - pv sindhu on vizag badminton academy
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు.. ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. సచివాలయానికి వచ్చిన సింధును.. సీఎం జగన్, మంత్రులు అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన 30 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని ఆమెకు అందించారు.
సీఎంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సింధూ ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు.
ఇదీ చదవండి: pv sindhu: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న పీవీ సింధు