తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇందిరా భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలను పీవీ సోదరుడు పీవీ మనోహర్రావు ప్రారంభించారు.
గాంధీభవన్లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం - pvnr centenary birth anniversary
పీవీ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని గాంధీభవన్లో ప్రారంభమయ్యాయి. పీవీ నరసింహారావు సోదరుడు పీవీ మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రాంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
pv-centenary
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్సవాల కమిటీ ఛైర్మన్ గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు పాల్గొని జ్యోతి ప్రజల్వన చేశారు. నరసింహారావు చిత్రపటం వద్ద పలువురు నాయకులు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. స్వర్గీయ పీవీ నరసింహారావు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ డాక్యుమెంటరీ ప్రదర్శించారు.
ఇవీ చూడండి:కరోనా చికిత్స కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు: సీఎం జగన్