ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయవాదుల హత్యతో సంబంధం లేదు: పుట్ట మధు - తెలంగాణ వార్తలు

తెలంగాణలో జరిగిన హైకోర్టు న్యాయవాదుల జంట హత్య కేసులో పోలీసులు చేయాల్సిన దర్యాప్తు మీడియానే చేస్తోందని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలకు మీడియా తోడైందని విమర్శించారు.

putta madhu
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు

By

Published : Feb 20, 2021, 3:36 PM IST

వామన్​ రావు దంపతుల హత్యలో తనపై వస్తున్న ఆరోపణలపై పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు స్పందించారు. హత్య కేసులో పోలీసులు చేయాల్సిన దర్యాప్తు మీడియానే చేస్తోందని ఆరోపించారు. హత్య తర్వాత తాను మంథనిలో ఉండటం లేదని... ముఖం చాటేశాని కొన్ని టీవీలు, పత్రికలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని అన్నారు.

మంథనిలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న మధు.. తాను ఎక్కడికీ పారిపోలేదని.. మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్​, కేటీఆర్​లను ఏ విధమైన అపాయింట్‌మెంట్‌ అడగలేదన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు మంథని ఎమ్మెల్యేలకు అమ్ముడు పోయాయని మండిపడ్డారు. తనను జైలుకు పంపించేందుకు తాపత్రయపడుతున్నాయన్నారు. తనపై కక్ష కట్టి ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదన్నారు.

తాను మోసగాన్ని కాదని స్పష్టం చేశారు. హత్య ఘటనపై పోలీసుల విచారణ తర్వాత హైదరాబాద్​లో అన్ని సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాని పుట్ట మధు వెల్లడించారు.

ఇదీ చదవండి:

సఖినేటిపల్లిలో సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి

ABOUT THE AUTHOR

...view details