ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ' నిలుపుదలకు ప్రయత్నిస్తా: పురందేశ్వరి - Purandeswari comments on budget

విశాఖ ఉక్కు కర్మాగారంపై మొదటి నుంచీ... భారతీయ జనతా పార్టీకి సానుభూతి ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని... కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

Purandeswari and madhav
పురందేశ్వరి, మాధవ్

By

Published : Feb 7, 2021, 6:07 PM IST

Updated : Feb 7, 2021, 6:13 PM IST

మీడియాతో మాట్లాడుతున్న భాజపా నేతలు

విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో వాస్తవ పరిస్థితిని వివరిస్తానని.. ప్రజాభిప్రాయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతానని కేంద్ర మాజీ మంత్రి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతే.. తమకు విషయం తెలిసిందని అన్నారు. విశాఖలో భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారంతో ప్రజలకు విడదీయరాని బంధం ఉందని.. వ్యక్తిగతంగా తనకూ ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు ప్రయత్నం చేస్తానని పురందేశ్వరి హామీ ఇచ్చారు.

కేంద్ర బడ్జెట్‌లో విశాఖ మెట్రోకు ప్రాధాన్యత ఇచ్చారని పురేందేశ్వరి అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ విషయాలు అమలు చేయలేదో చెప్పాలని విమర్శకులను కోరారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అసాధారణ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. బడ్జెట్‌లో ఆరోగ్య, మానవ వనరుల అభివృద్ధి, దేశ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాలు తీసుకున్నారని.. ఆరోగ్యం విషయంలో కీలక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు: ఎమ్మెల్సీ మాధవ్

క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ తీసుకున్న స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. భాజపా.. విశాఖ ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణకు కృషి చేసిందని అన్నారు. హిందూస్తాన్ షిప్ యార్డ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కాపాడిన ఘనత భాజపాకే ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రకటన జరిగిన తరువాత దిల్లీ వెళ్లి మాట్లాడినట్టు చెప్పారు. స్టీల్ ప్లాంట్ విశాఖను వదిలి పోదని.... ఒక్క సెంటు భూమిని పొనివ్వనని మాధవ్ అన్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేకించడం సరికాదు. స్టీల్ ప్లాంట్ నష్టాలు నివారించాలని ఇంకా పెద్ద సంస్థలో కలిపి అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. లక్ష మందికి ఉపాధి కల్పించేలా యోచన చేస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కసరత్తు...మూడు దశల్లో ప్రక్రియ పూర్తి !

Last Updated : Feb 7, 2021, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details