ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హైదరాబాద్ తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురై పలు కాలనీలు జలమయం అయ్యాయి. భారీ వరదలతో పురానాపూల్ వద్ద మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు వంతెనపై రాకపోకలను నిషేధించారు.
తెలంగాణ : మూసీ వంతెనకు పగుళ్లు... ఆందోళనలో ప్రజలు - పురానాపూల్ వంతెనపై పగుళ్లు
తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పలు వంతెనలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్ పురానాపూల్ వద్ద మూసీ నది కొత్త వంతెనకు పగుళ్లు వచ్చాయి. వంతెన పరిస్థితి చూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వంతెనపై రాకపోకలను నిషేధించారు.
musi bridge
శనివారం కురిసిన వర్షానికి మూసీకి వరద పెరగడంతో పిల్లర్ ఒకచోట స్వల్పంగా కుంగింది. వంతెనను అధికారులు పరిశీలిస్తున్నారు. వంతెన పరిస్థితిని చూసి పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ఇదీ చదవండి:నీటమునిగిన ఆక్వా చెరువులు.. ఉత్పత్తులు కొనే నాథులే లేరు