ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

pulichintala water: గేటు ధ్వంసంతో 34 టీఎంసీలకు పైగా దిగువకు..

రూ.కోట్లు ఖర్చు చేసినా ఒక టీఎంసీ నీళ్లు ఎక్కడి నుంచీ తీసుకురాలేం. ప్రస్తుత ఖరీఫ్‌ సమయంలో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు బ్యాలెన్సింగు జలాశయంగా నిర్మించుకున్న పులిచింతల ప్రాజెక్టులో గేటు ధ్వంసం భద్రతపరంగా కీలకాంశమైతే.. మరోవైపు దాదాపు 34 టీఎంసీల నీటిని ఖాళీ చేసి దిగువకు వదిలేయాల్సి వస్తోంది.

water waste
water waste

By

Published : Aug 6, 2021, 7:11 AM IST

రూ.కోట్లు ఖర్చు చేసినా ఒక టీఎంసీ నీళ్లు ఎక్కడి నుంచీ తీసుకురాలేం. ప్రస్తుత ఖరీఫ్‌ సమయంలో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు బ్యాలెన్సింగు జలాశయంగా నిర్మించుకున్న పులిచింతల ప్రాజెక్టులో గేటు ధ్వంసం భద్రతపరంగా కీలకాంశమైతే.. మరోవైపు దాదాపు 34 టీఎంసీల నీటిని ఖాళీ చేసి దిగువకు వదిలేయాల్సి వస్తోంది. దిగువన ప్రకాశం బ్యారేజి సామర్థ్యమూ తక్కువే కావడంతో ఆ నీరంతా సముద్రంలోకి పోతోంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం పులిచింతలలో 10 టీఎంసీల నీటినిల్వ స్థాయి వరకు ఖాళీ చేసి విరిగి పడిన 16వ గేటు వద్ద స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటు చేయాలని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎగువ నుంచి ప్రవాహాలు పెరుగుతున్నాయి. మరో 2 లక్షల క్యూసెక్కులు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దిగువకు వదిలే నీటి పరిమాణమూ పెరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 34 టీఎంసీల లెక్కన పరిశీలిస్తే ఏకంగా 3.40 లక్షల ఎకరాల సాగుకు అవసరమయ్యే నీటిని వృథా చేసుకుంటున్నట్లు భావించాల్సి ఉంటుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే దాదాపు 70 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. నాడు విద్యుదుత్పత్తి రూపంలో విలువైన సాగునీటిని నష్టపోతే ఇప్పుడు మరో రూపంలో ప్రమాదం వచ్చింది. ఈ ఏడాది పులి‘చింతలు’ ఎక్కువయ్యాయి.

రాత్రి 10 గంటలకు 30.74 టీఎంసీల నీటి నిల్వ

పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం రాత్రి పది గంటలకు 4.86 లక్షల క్యూసెక్కుల నీటిని 17 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈఈ రాజశేఖర్‌ తెలిపారు. ఇన్‌ఫ్లో 2,16,444 క్యూసెక్కులు ఉందన్నారు. ప్రాజెక్టులో 30.74 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.

పులిచింతల ప్రాజెక్టు నిర్మించి పదేళ్లు కూడా పూర్తి కాకముందే గేటు విరిగిపోవటం అధికారుల్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రమాదానికి నిర్మాణ లోపాలు కారణమా.. లేక గేట్ల అమరికలో ఏమైనా తేడాలున్నాయా అని అధికారులకు అంతు చిక్కటం లేదు. ప్రస్తుతానికి నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టిన అధికారులు.. స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరద అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇదీ చదవండి: PULICHINTALA: తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు.. ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details