ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Govt on New districts: ప్రజల సూచనలు తప్పక నమోదు చేయాలి - కొత్త జిల్లాలపై కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం

Records Public Opinion on new districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనపై ప్రజల సూచనలు, అభ్యంతరాలు తప్పక నమోదు చేయాలని.. జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశం జారీ చేసింది.

Govt on New districts
Govt on New districts

By

Published : Feb 4, 2022, 9:10 AM IST

Records Public Opinion on new districts: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటనపై ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆన్‌లైన్‌లో తప్పకుండా ఏ రోజుకారోజే నమోదు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అర్జీలు ఇచ్చే వారికి తిరిగి సమాధానం పంపేలా వివరాలు నమోదు చేయాలని సూచించింది. జిల్లా కలెక్టర్ల నుంచి చివరిగా వచ్చే ప్రతిపాదనలను క్రోడీకరించి ప్రభుత్వానికి సిఫార్సు చేసేలా సచివాలయంలో అంతర్గత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు ప్రాథమిక నోటిఫికేషన్‌లో గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పేర్కొన్న మండలాలు తాజాగా మారాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాలో ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో మార్పులు చేస్తూ సవరణ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను బుధవారం జారీచేశారు. వీటికి తగ్గట్లు సంబంధిత కలెక్టర్లు జిల్లాలో మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

ఇదీ చదవండి..జనసంద్రమైన విజయవాడ... ఉప్పెనలా కదిలి వచ్చిన ఉద్యోగులు

ABOUT THE AUTHOR

...view details